Game Changer Total Collections: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఫ్లాప్ కావడానికి పలు కారణాలున్నాయి. ఈ సినిమా విడుదలైన వెంటనే HD ప్రింట్ ఆన్ లైన్ లో ప్రత్యక్షం అయింది. అప్పటి నుంచి ఈ సినిమా పై కొన్ని కుట్రలు జరిగాయి. ఆ తర్వాత ఈ సినిమా కొన్ని లోకల్ టీవీల్లో ప్రసారం కావడం వంటివి ఈ సినిమాకు కోలుకోలేని దెబ్బ తీశాయని చెప్పాలి. మరోవైపు శంకర్ ఈ సినిమాను అడ్డగోలుగా తెరకెక్కించడం కూడా ఈ సినిమా ఫ్లాప్ కు కారణంగా నిలిచింది. ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అయిన వ్యక్తి ఆ తర్వాత ఛీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి మాత్రమే ఎలక్షన్ కమిషనర్ గా రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు పేర్లను కేంద్రానికి పంపిస్తే.. వారిలో ఒకరిని కేంద్రం నియమిస్తుంది.ఇలాంటి లాజిక్ లేని సీన్స్ సినిమాలో ఎన్నో ఉన్నాయి. మరోవైపు ఒక ఐఏఎస్ అధికారికి మరో జ్యురిడిక్షన్ లో పోకూడదనే రూల్ ను చూపించారు. ఇది కూడా చాలా సిల్లీగా అనిపిస్తోంది. మొత్తంగా కర్ణుడి చావుకు ఎన్నో కారణాలున్నట్టు ‘గేమ్ ఛేంజర్’ డిజాస్టర్ కావడానికి ఇలాంటి కారణాలు ఎన్న ఉన్నాయి.
ఈ సినిమా తొలి రోజు తర్వాత అసలు కోలుకోలేదు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ విషయానికొస్తే.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 70 కోట్ల షేర్ (రూ.110 కోట్ల ) గ్రాస్ వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 90 కోట్ల షేర్ (రూ.150 కోట్ల గ్రాస్ ) వసూళ్లను రాబట్టింది.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 165 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 167 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగి రూ. 90 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. మొత్తంగా చేసిన బిజినెస్ లో రూ. 77 కోట్ల రికవరీ సాధించలేకపోయింది. మొత్తంగా 2025లోనే కాదు.. రామ్ చరణ్, శంకర్ కెరీర్ లోనే ఈ సినిమా అతిపెద్ద డబుల్ డిజాస్టర్ గా నిలిచి చరిత్ర సృష్టించింది. రామ్ చరణ్... బుచ్చిబాబు సన దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం వచ్చే యేడాది రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా 2026 మార్చి 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..
ఇదీ చదవండి: కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









