
Ganesh Chaturthi 2025: వినాయక చవితి సందర్భంగా గణేశుడి రాకతో దేశమంతా ప్రతి ఊరూ వాడా ప్రతిచోటా భక్తి వాతావరణం నెలకొంది. సామాన్యుల ఇళ్లలోనే కాకుండా ప్రముఖుల ఇళ్లలో కూడా వినాయక చవితి పండుగ ఘనంగా జరిగింది. బాలీవుడ్లో ఒక ముస్లిం స్టార్ హీరో కుటుంబం కూడా వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా నిర్వహించింది. ఎంతో భక్తితో గణేశుడిని పూజించారు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు సల్మాన్ ఖాన్. బుధవారం సల్మాన్ ఖాన్ తన కుటుంబంతో కలిసి వినాయకునికి హారతి ఇస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి.
ప్రతి సంవత్సరం లాగే, సల్మాన్ ఖాన్ ఈ సంవత్సరం కూడా గణేష్ చతుర్ధి పండుగకు తన ఫ్రెండ్స్ తో పాటు కుటుంబసభ్యులను ఆహ్వానించాడు. సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పిత ఇంట్లో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో, ఒక పండితుడు హారతి ఇస్తూ మంత్రాలను పఠిస్తున్నారు.
సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, తల్లిదండ్రులు సలీం-సల్మా, తోబుట్టువులు, సన్నిహితులు ఆ గణేశునికి హారతి పట్టారు.
ఈ పండుగ ప్రేమ, కుటుంబ బంధానికి ఒక వేడుకగా నిలిచింది. ఆ కుటుంబం మరోసారి భక్తి, విశ్వాసం, సంప్రదాయం, స్ఫూర్తిని అందంగా ప్రదర్శించి హారతిని పట్టుకుని గణేశుడిని పూజించింది.
వినాయక చవితి సందర్భంగా సల్మాన్ ఖాన్ హారతి ఇచ్చిన ఈ వీడియోను చాలా మంది ప్రశంసించగా, కొందరు విమర్శించారు. సల్మాన్ ఖాన్ వీడియోపై ఒక నెటిజన్ వ్యాఖ్యానిస్తూ.. "సల్మాన్ ముస్లిం కావడం సిగ్గుచేటు" కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరో నెటిజన్ కామెంట్ చేస్తూ.. "పేరు కోసమే ముస్లిం అని ఎందుకు అంటున్నారు..." అని అడిగాడు. మరొకరు "సల్మాన్ ఖాన్ ముఖంలో ఎలాంటి భావోద్వేగాలు లేవు..., భాయిజాన్, ఇది తప్పు..." అని అన్నాడు. మరో నెటిజన్, "నువ్వు అలాంటి డ్రామా చేయకపోతే, ఆ దుకాణం నడవదు..." అని అన్నాడు. సల్మాన్ ఖాన్ గణేష్ పండుగ జరుపుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook