
Full Moon movie: 2001లో కేవలం పది మందితో మొదలైన గ్లిట్టర్ ఫిల్మ్ అకాడమీ, ఈరోజు దేశవ్యాప్తంగా 1000 పైగా టాలెంట్స్‌ను బాలీవుడ్, టాలీవుడ్‌కు పరిచయం చేసిన సంస్థగా ఎదిగింది. దీన్ని స్థాపించిన మరియు విజయవంతంగా నడిపించిన దర్శక నిర్మాత దీపక్ బల్దేవ్ తాజాగా తన దర్శకత్వంలో తీసిన బాలీవుడ్ చిత్రం ఈ ఖ్వాబ్ సారే జూతే ఏడురోజుల్లో పూర్తై, 2021 ఐఫా అవార్డుకు నామినేట్ కావడం గర్వకారణంగా మారింది.
దీపక్ మాట్లాడుతూ, "ఈ సంస్థను ప్రారంభించినప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ ఈ రోజు వెనక్కి చూసుకుంటే, నేను సాధించిన ప్రగతి ఎంతో ఆశాజనకంగా ఉంది. మా అకాడమీ నుండి నేహా శర్మ, వందనా గుప్తా, రూబీ వంటి నటీనటులు టాలీవుడ్ లోకి వచ్చారు. అలాగే 2012లో హిందీ సినిమా 'కమీనా'ను తెలుగు రీమేక్ చేసాను. 2016లో మా ఇన్స్టిట్యూట్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఉత్తమ దక్షిణాది నటన శిక్షణ సంస్థ అవార్డు దక్కింది."
అలాగే, జరీనా వహాబ్‌తో “తూబేకబర్” అనే ఓటీటీ సినిమా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. త్వరలో బాలీవుడ్ స్టార్‌తో "ఫుల్ మూన్" అనే సినిమా తెరకెక్కించబోతున్నారు. దీన్ని తెలుగులో సందీప్ రెడ్డి వంగ, సంకల్ప్ రెడ్డి లాంటి మైలురాయి సినిమాగా భావిస్తున్నారు.
పలు ప్రముఖులైన చుంకీ పాండే, ఆదిత్య పాంచోలీ, నితిన్ ముఖేష్‌లకు సౌత్ ఇండస్ట్రీలో సెలెబ్రిటీ మేనేజ్మెంట్ చేస్తూ, బాలీవుడ్ నుండి టాలీవుడ్‌కు, టాలీవుడ్ నుండి బాలీవుడ్‌కు నూతన టాలెంట్‌ను పరిచయం చేయడంలో దీపక్ ముందుంటున్నారు.
తన ప్రత్యేకత ఏమిటంటే – కథకు తగ్గ ఆర్టిస్ట్‌ను ఖచ్చితంగా ఎంపిక చేయగల సామర్థ్యం, అలాగే తన వద్ద ఉన్న టాలెంట్ బ్యాంక్ ద్వారా నాణ్యమైన ప్రతిభను ఫిల్మ్ మేకర్స్‌కి అందించగలగటం అని తెలిపారు. మొత్తం పైన సరికొత్త నటులకు ఈ అకాడమీ ఎన్నో అవకాశాలను అందజేస్తుంది. వారు ఇలానే తమ అకాడమీని నడిపి మరింత మంది కొత్త నటి నటులను ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అని ఆశిస్తున్నారు ఎంతోమంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe