Godarike Sogganne: మంచు విష్ణు అవా మ్యూజిక్ బ్యానర్ లో శివ బాలాజీ, మధుమితలతో ‘గోదారికే సోగ్గాన్నే’ జానపద గీతం విడుదల.. సోషల్ మీడియాలో వైరల్..

Godarike Sogganne: మంచు విష్ణు హీరోగానే కాకుండా.. నిర్మాతగా.. మా అధ్యక్షుడిగా పలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నిర్మాతగా దూసుకుపోతున్న మంచు విష్ణు .. తాజాగా మ్యూజిక్ ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు. అందులో భాగంగా శివ బాలాజీ, మధుమతిలతో ‘గోదారికే సోగ్గాన్నే’ అనే జానపద గీతాన్ని విడుదల చేశారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 24, 2025, 06:10 PM IST
Godarike Sogganne: మంచు విష్ణు అవా మ్యూజిక్ బ్యానర్ లో శివ బాలాజీ, మధుమితలతో  ‘గోదారికే సోగ్గాన్నే’ జానపద గీతం విడుదల.. సోషల్ మీడియాలో వైరల్..

Godarike Sogganne:  విష్ణు మంచు ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలోని అవా మ్యూజిక్ బ్యానర్‌పై  నిజ జీవితంలో భార్యా భర్తలైన శివ బాలాజీ, మధుమిత నటించిన జానపద గీతం ‘గోదారికే సోగ్గాన్నే’ తాజాగా విడుదల చేశారు. బిగ్ బాస్ తొలి సీజన్ విన్నర్ తర్వాత పలు చిత్రాల్లో నటించాడు. తాజాగా ఇపుడు ఓ ప్రైవేట్ ఫోక్ సాంగ్ లో నటించారు. తాజాగా ఈ గీతాన్ని రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సాంగ్ ను  విడుదల చేశారు. ఈ పాట విడుదల సందర్భంగా శివ బాలాజీ, మధుమిత మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

Add Zee News as a Preferred Source

శివ బాలాజీ మాట్లాడుతూ .. ‘ఈ పాటలో కంటెంట్ 8 నిమిషాలు ఉంటుందన్నారు. ఈ సాంగ్ లో స్టోరీ మొత్తం చెప్పాలి. ఈ కాన్సెప్ట్‌కి మ్యూజికల్  నెరేషన్ అని పేరు పెట్టాను. ముందుగా మేం నటిస్తానని అసలు ఎక్స్ పెక్ట్ చేయలేదు.. ఈ కాన్సెప్ట్ నా వద్దకు వచ్చింది. ఆ తరువాత మధుమిత ప్రాజెక్ట్‌లోకి వచ్చారు.అలా ఈ పాటను  మేం ఇద్దరం సింగిల్ టేక్‌లో చేసేశాం. సెట్స్ మీద చాలా ఇంప్రోవైజ్ చేశామన్నారు. ఏ షాట్‌కి కూడా కష్టపడలేదన్నారు. ఈ పాటకు రెండు క్లైమాక్స్ ప్లాన్ చేశాము. సాంగ్ ఎంతో  అద్భుతంగా వచ్చింది. అందరికీ నచ్చుతుందన్నారు.

మధుమిత మాట్లాడుతూ .. సామాజిక మాధ్యమాల్లో  ఇన్ ఫ్లూయెన్సర్‌ టాలెంట్‌ను మరింతగా బయటకు తీసుకు రావాలనే ఉద్దేశంతో ఈ మ్యూజికల్ ఆల్బమ్స్‌ను స్టార్ట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు.  ఈ క్రమంలో నా వద్దకు ఈ పాట వచ్చింది. కాన్సెప్ట్ నాకు చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది.  జంటగా మమ్మల్ని అందరూ ప్రేమిస్తుంటారు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఇలా పాటతో జోడి అందరి ముందుకు రాబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇందులో మాట్లాడిన గోదారి యాస కూడా అద్భుతంగా అనిపిస్తోంది.  అందరినీ ఆకట్టుకునేలా ఈ పాట ఉంటుంది.  

అవా ఎంటర్టైన్మెంట్ సీఈఓ చిదంబరం మాట్లాడుతూ .. ‘మంచు మోహన్ బాబు , విష్ణు యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే క్రమంలో అవా మ్యూజిక్‌ను స్టార్ట్ చేశారు.  ముందు ముందు మరింత కంటెంట్ మా నుంచి రాబోతోంది. మాకు ఇంతలా సపోర్ట్ చేసిన విష్ణుకి థాంక్స్. మా పాటలో నటించిన శివ బాలాజీకి, మధుమితకి థాంక్స్ అన్నారు.

బుక్ మై షో వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ పాలడుగు ప్రతినిధి  మాట్లాడుతూ .. ‘‘గోదారికే సోగ్గాన్నే’ పాట ఎంతో అద్భుతంగా ఉందన్నారు. ఇందులోని యాస గానీ, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అంతేకాదు నటించిన శివ బాలాజీ,  మధుమిత   చెప్పొచ్చు. ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందన్నారు.

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News