ALCC: గ్రాండ్ గా ‘ఏ ఎల్ సి సి’ మూవీ బిగ్ టికెట్ లాంచ్ ..

ALCC: యెల్ ఆర్ ఫిల్మ్ సర్కూట్స్ బ్యానర్‌పై లేలీధర్ రావు కోలా డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం‘ఏ ఎల్ సి సి’ (ఓ యూనివర్సల్ బ్యాచిలర్). రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ  ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్  గ్రాంగ్ గా జరిగింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 21, 2025, 03:35 PM IST
ALCC: గ్రాండ్ గా ‘ఏ ఎల్ సి సి’ మూవీ బిగ్ టికెట్ లాంచ్ ..

ALCC: ‘ఏఎల్ సీసీ’ (ఓ యూనివర్సల్ బ్యాచిలర్)సినిమా బిగ్ టికెట్ లాంఛ్ వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఈ సినిమాలో హీరోగా నటించిన JP నవీన్ మాట్లాడుతూ.. ''ఇక్కడికి వచ్చిన  పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికి పేరు పేరు ధన్యవాదాలు. ఒక యంగ్ స్టర్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా హీరోగా ఎంట్రీ అవ్వడం అంటే చాలా కష్టం. అది మీ మీడియా కి బాగా తెలుసు. నాలాంటి వ్యక్తికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దర్శకుడు లేలీధర్ రావు కి ప్రత్యేక  కృతజ్ఞతలు తెలియాజేసారు. అంతకాదు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా బాగా కుదిరాయి. మాలాంటి కొత్తవాళ్ళని దయచేసి సపోర్ట్ చెయ్యండని చెప్పుకొచ్చారు.

Add Zee News as a Preferred Source

హీరోయిన్ శ్రావణి శెట్టి మాట్లాడుతూ.. "ముందుగా స్టేజి మీద ఉన్న అందరి పెద్దలకు  నా నమస్కారాలు. నాకు హీరోయిన్ ఛాన్స్  ఇచ్చిన లేలీధర్ రావు కి ధన్యవాదాలు తెలిపారు. లేలీధర్ రావు దర్శకత్వం నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయన  ఒక టీచర్ లా మాకు దిశా నిర్దేశం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అలాంటిది ఆయన ఒక ప్యాషన్ తో డైరెక్టర్ గా మారి ఈ సినిమా చేశారని కొనియాడారు. తప్పకుండా ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. అందరికి నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

డైరెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. "ముందుగా ఇక్కడికి విచ్చేసిన వారందరికీ పేరు పేరునా నమస్కారాలు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే విషయం పక్కనపెడితే.. వైవిధ్యమైన చిత్రాలను ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే  తప్పకుండా ఆదరిస్తారు. ఈ సినిమాను కూడా ఆదరిస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త వారిని ప్రోత్సహించండన్నారు. ఈ సినిమా చిన్న సినిమా అయినా, ఒక వైవిధ్యమైన చిత్రం. డైరెక్టర్ లేలీధర్ రావు కోలా చిత్రాన్ని చాలా బాగా తీశారు. నష్టాలు వస్తున్నాయని రైతు వ్యవసాయం ఆపడు. మేము కూడా అంతే అన్నారు.  సినిమాలు ప్లాప్ అవుతున్నాయని సినిమాలు చెయ్యడం మానము. ఇంకా కొత్త కొత్త సినిమాలు చెయ్యడానికి ప్రయత్నిస్తామన్నారు.

డైరెక్టర్ సముద్ర  మాట్లాడుతూ.. " లేలీధర్ రావు కోలా ఒక  మంచి డైరెక్టర్ అనే కంటే టీచర్ అని చెప్పాలి. పిల్లల భవిష్యత్తు కోసం గొప్ప గొప్ప పాఠాలు చెప్పారు. అలాంటి గొప్ప టీచర్ నేడు డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా మారి ఈ సినిమా చేశారు. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక ఈ సినిమా డైరెక్టర్ లేలీధర్ రావు కోలా మాట్లాడుతూ.. "మా సినిమాని ఎంకరేజ్ చెయ్యడానికి వచ్చిన పెద్దలకు మీడియా మిత్రులకు  నమస్కారాలు. ఈ చిత్రాన్ని కష్టంగా కాకుండా ఎంతో ఇష్టంగా తీసిన విషయాన్ని ప్రస్తావించారు. కచ్చితంగా ప్రేక్షక దేవుళ్ళకు నచ్చి తీరుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  ఈ సినిమా కోసం నా టీం చాలా కష్టపడింది. వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈ సినిమాని సపోర్ట్ చెయ్యడానికి వచ్చిన తన తోటి దర్శకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు.ఈ నెల 25న ఈ సినిమా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News