)
Star Actress Childhood Photo: మనం ఒకటి చేయాలి అనుకుంటే దేవుడు ఇంకొకటి తలుస్తారు అన్నట్టు.. ఒక హీరోయిన్ తన టీచర్ అవ్వాలి అనుకుని టీచర్ అయ్యింది. అయితే ఆమెకు దేవుడు మరింత అదృశ్యవంతమైన లైఫ్ ముందే రాసిపెట్టారు…అందుకు తగ్గట్టుగానే టీచర్ నుంచి హీరోయిన్ అయి ఇప్పుడేమో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది.
ఇక్కడ షేర్ చేసిన ఫోటో కూడా.. ఆమె టీచర్ గా పని చేస్తున్నప్పుడు స్కూల్లో దిగిన ఫోటో. ఈ హీరోయిన్ గురించి చెప్పాలంటే .. తెలుగులో ఈ తరం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు.. ఆమె పెట్టింది పేరు. ముఖ్యంగా ఆమె చేసిన ఒక సినిమా అప్పట్లో స్టార్ హీరోల సినిమాలను సైతం దాటేసి.. కోట్ల కలెక్షన్స్ సాధించింది.
అంతేకాదు.. మోడర్న్ పాత్రలు చేయడంలో కూడా ఈ హీరోయిన్ ముందుంటుంది. ఇప్పటికే ఈ హీరోయిన్ ఎవరో మీ అందరికీ అర్థమయిపోయి ఉంటుంది. ఆమె మరెవరో కాదు.. మనమందరం స్వీటీ అని పిలుచుకునే అనుష్క. నాగార్జున సూపర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనుష్క.. అంతకుముందు యోగా టీచర్‌గా స్కూల్లో పనిచేసేది.
ఇక ఆ తరువాత.. పూరి జగన్నాథ్ సూపర్ సినిమా ద్వారా హీరోయిన్ గా మారింది. ఇక అప్పగించి అనుష్క ఒక్కొక్క సినిమా చేస్తూ.. తెలుగు ఇండస్ట్రీలో ఎంత ఎత్తు ఎదిగింది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టేటస్ తెచ్చుకుంది ఈ హీరోయిన్.
ఇక ఆ తరువాత వచ్చిన బాహుబలి 2 చిత్రం కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇక మళ్లీ అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన భాగుమతి చిత్రం కూడా అప్పట్లో మంచి విజయం సాధించింది. అప్పటి నుంచి సినిమాలు కొద్దిగా తగ్గిస్తూ వచ్చింది ఈ బొమ్మాలి.
ఇక ఈ మధ్యనే క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఘాతీ చిత్రంలో కనిపించిన అనుష్క.. సోషల్ మీడియాకి కూడా బై చెప్పింది.. మరి అనుష్క ఏమన్నా పెళ్లి పనుల్లో పడిందా.. త్వరలోనే పెళ్లి చేసుకొని కనిపించబోతోందా.. అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి అనుష్క స్కూల్లో టీచర్ గా పని చేస్తున్నప్పుడు ఫోటో మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook