Gummadi Narsaiah Biopic Launch Ceremony: పేదల పక్షపాతి, సైకిల్ పై అసెంబ్లీకి వెళ్లిన ఇల్లందు సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథను తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తున్నారు. ‘గుమ్మడి నర్సయ్య’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో.. కన్నడ హీరో శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మాత ఎన్. సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పాల్వంచలో గుమ్మడి నర్సయ్య బయోపిక్ షూటింగ్ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ తో పాటు సినిమాటోగ్రఫి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కవిత సహా పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మొదటి సన్నివేశానికి గీతా శివరాజ్ కుమార్ క్లాప్ కొట్టగా.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని మల్లు స్క్రిప్ట్ అందించారు.
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. గుమ్మడి నర్సయ్య ప్రజల మనిషి అని, పేదవారి దేవుడు అంటూ కొనియాడారు. ఎమ్మెల్యే జీతం, ఆస్తులను దానం చేయడం, సైకిల్‌ను వాడటం నర్సయ్య నిరాడంబరతకు నిదర్శనమన్నారు. ప్రతి ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ ఆయన జీవిత చరిత్రను చూడాలన్నారు.ఈ సినిమా ద్వారా ప్రజాప్రతినిధులలో మార్పు వచ్చి అవినీతి తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ సినిమాకు సబ్సిడీ ఇప్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుమ్మడి నర్సయ్య మన తెలంగాణ బిడ్డ అని తలుచుకుంటేనే హృదయం సంతోషంతో ఉప్పొంగుతోందని అన్నారు. ఆయన బయోపిక్‌ను అయిదు భాషల్లో రిలీజ్ చేయడం వల్ల అందరికీ తెలంగాణ వాళ్ల గొప్పతనం తెలుస్తుందన్నారు.
హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ఒక మంచి మనిషి రోల్ లో నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ పరమేశ్వర్ కి, నిర్మాత ఎన్. సురేష్ రెడ్డికి థాంక్స్. ఈ సినిమా కోసం తాను తెలుగు నేర్చుకుంటానని.. సొంతగా డబ్బింగ్ కూడా చెబుతానని శివరాజ్‌కుమార్ అన్నారు. ఈ సినిమాలో నటిస్తున్నందకు చాలా సంతోషంగా, గర్వంగా అనిపిస్తోందన్నారు. నర్సయ్యను చూస్తుంటే మా నాన్నను చూసినట్లు అనిపిస్తోందని తెలిపారు శివరాజ్. అలాగే రాజకీయాల్లోకి రావాలనుకునే యువత కచ్చితంగా ఈ చిత్రాన్ని చూడాలని పిలుపునిచ్చారు.
గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. ఈ వ్యవస్థతో పాటు మనందరిలో మార్పు రావాలన్నారు. ఒకరిని ఒకరు మోసం చేసే పద్ధతులు మారాలని.. ఇదే నేను కోరుకునేదన్నారు. శివరాజ్ కుమార్ గారు నా రోల్ చేయడం సంతోషకరం. ఈ సినిమా రిలీజ్ తర్వాత.. వ్యవస్థలో, ప్రజల్లో మార్పు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, ఇతర అప్ డేట్స్ సినిమాపై ఆసక్తి పెంచేశాయి. గుమ్మడి నర్సయ్యగా శివ రాజ్ కుమార్ లుక్ ఆకట్టుకుంది. దీంతో యావత్ తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది.
Also Read: Rithu Chowdary: మామూలు ట్విస్ట్ కాదు భయ్యా.. ఊహించని షాక్ ఇచ్చిన బిగ్ బాస్.. రీతూ చౌదరి ఎలిమినేట్..!
Also Read: Punarnavi Bhupalam: కాబోయే భర్తను ఇంట్రడ్యూస్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. అబ్బాయి ఎవరో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.









