రివ్యూ: కింగ్‌స్టన్ (Kingston)
నటీనటులు: జీవీ ప్రకాష్ కుమార్, దివ్యభారతి, చేతన్, అజగమ్ పెరుమాల్, ప్రవీణ్, ఫైర్ కార్తీక్ తదితరులు..
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: గోకుల్ బెనోయ్
ఎడిటర్: సాన్ లోకేష్
నిర్మాతలు: జీవీ ప్రకాష్ కుమార్,ఉమేష్ కేఆర్ బన్సల్, భవానీ శ్రీ
దర్శకత్వం: కమల్ ప్రకాష్
విడుదల తేది: 7-3-2025
జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడిగానే కాకుండా.. హీరోగా మెప్పిస్తున్నాడు. ఈయన కథానాయకుడిగా నటించడంతో పాటు నిర్మించిన సినిమా 'కింగ్‌స్టన్'. ఈ శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. యారలల్ యూనివర్స్ పిక్చర్స్, జీ స్టూడియోస్ సంస్థలపై తెరకెక్కించారు. మన దేశంలో ఫస్ట్ సి అడ్వెంచర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
కథ విషయానికొస్తే..
ఈ సినిమాను 1982 బ్యాక్ డ్రాప్ లో మత్స్యకారుల నేపథ్యంలో తెరకెక్కించారు. అయితే.. సముద్రతీరంలోని ఓ గ్రామంలో బోసయ్య (అజగన్ పెరుమాళ్) ని ఊరి ప్రజలంతా కలిసి చంపేసి బొంద పెడతారు. దీంతో ఆయన ఆత్మ శాంతించకా తనను అన్యాయంగా చంపిన గ్రామస్థులను భయపెడుతుంటాడు. దీంతో గ్రామ ప్రజలు ఆయన శవాన్ని తీసి సముద్రంలో పారవేస్తారు. దీంతో అప్పటి నుంచి సముద్రంలోకి వెళ్లిన ప్రతి ఒక్కరు అనుమానాస్పదంగా చనిపోతూ ఉంటారు. దీంతో బోసయ్య ఆత్మ ఇదంత చేస్తుందని గ్రహించి సముద్రంలోకి ఎవరు వెళ్లకుండా.. ఆ ఊరి సముద్రానికి కంచె వేస్తారు. దీంతో ఆ ఊరి మత్స్య కారులకు పనిలేకుండా పోతుంది. దీంతో పక్కనే ఉన్న మరో సముద్ర తీరంలో గల ఊరికి వెళతారు. అక్కడ థామస్ అనే వ్యక్తి ఆ ఊరి వాళ్లకు పని ఇస్తాడు. కథ మళ్లీ వర్తమానంలోకి వస్తుంది. అతని వద్ద కింగ్ స్టన్ (జీవీ ప్రకాష్) పనిచేస్తుంటాడు. అయితే..థామస్ ఆ ఊరి వాళ్లతో అక్రమంగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేయిస్తాడు. ఈ క్రమంలో శ్రీలంక నేవీ వాళ్లు ఈ మత్స్య కారులను పట్టుకుంటారు. తమ వాళ్లతో అక్రమంగా డ్రగ్స్ సప్లై చేయిస్తున్నాడని తెలుసుకొని అతనికి ఎదరు తిరుగుతాడు. ఈ క్రమంలో ఏమైంది.. ఆ తర్వాత కింగ్ స్టన్ తన వాళ్లతో కలిసి ఆత్మలున్న సముద్ర తీరంలోకి వెళతారు. నిజంగానే అక్కడ దెయ్యాలు.. ఆత్మలున్నాయా..? చివరకు ఏమైందనేదే మిగిలిన స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
ఈ సినిమాను 1982లో చూపించి మళ్లీ వర్తమానంలో కథ నడుస్తుంది. ముఖ్యంగా హీరో .. ఊరి వాళ్ల కష్టాలను తన కష్టాలుగా భావించి ఎలా బిహేవ్ చేసాడు. మొత్తంగా ఫస్ట్ హాఫ్ సముద్రంలో ఆత్మ, దెయ్యాలు అని మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాడు దర్శకుడు. అసలు సముద్రంలో ఏముందనే ఆసక్తికరమైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా ఉంది.
హీరో జీవీ ప్రకాష్ కూడా ఈ సినిమాను హార్రర్, ఫాంటసీ సినిమానే ప్రమోట్ చేసాడు. ఫస్ట్ హాఫ్ తమిళ నేటివిటీతో ఉండటం కాస్త ఇబ్బంది కలిగించే అంశం. సెకాండాఫ్ లోనే అసలు కథలోకి వెళుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకునే విధంగా ఉంది.
దర్శకుడు తాను చెప్పాలనుకున్న విషయాన్ని సెకండాఫ్ లో చెప్పడం ప్రేక్షకులకు అసహానికి గురి చేస్తాయి. ముఖ్యంగా సముద్రంలోని సీన్స్ బాగున్నాయి.నిర్మాణ విలువలు బాగున్నాయి. దెయ్యాలుగా...ఆత్మలను చూపించడంలో మేకప్ మేన్ కృషిని మెచ్చుకోవాల్సిందే. జీవి ప్రకాష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటర్ ఫస్టాఫ్ లో తన కత్తెరకు మరింత పదను పెడితే బాగుండేది.
నటీనటీల విషయానికొస్తే..
జీవీ ప్రకాష్ ఈ సినిమాకు హీరోగానే కాకుండా.. నిర్మాతగా.. సంగీత దర్శకుడిగా త్రిపాత్రాభినయం చేసారు. మూడు పాత్రలకు న్యాయం చేసాడు. నటుడిగా మంచి ఈజ్ తో నటించాడు. తమిళ గ్రామీణ యువకుడి పాత్రలో జీవించాడు. బ్యాచిలర్ సినిమాలో తన గ్లామర్ తో యూత్ కు నిద్ర లేకుండా చేసిన దివ్యభారతి ఈ సినిమాలో తన నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది. బోసయ్య పాత్రలో అజగన్ పెరుమాళ్ నటన బాగుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
పంచ్ లైన్.. ‘కింగ్‌స్టన్’.. ఓ మోస్తరుగా మెప్పించే హార్రర్ సస్పెన్స్ డ్రామా..
రేటింగ్: 2.75/5
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









