Guardian OTT: ఒక రాయితో జీవితం మొత్తం అల్లకల్లోలం..ఓటీటీలో అలరిస్తున్న హన్సిక హారర్ థ్రిల్లర్..!

Hansika Guardian OTT: హన్సిక గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ హీరోయిన్. ఇప్పుడు ఏమి ముఖ్య పాత్రలో నటించిన గార్డియన్ అనే తమిళ చిత్రం.. తెలుగులో డబ్ అయ్యి.. ఆహాలో అందుబాటులోకి వచ్చింది.

Written by - Vishnupriya | Last Updated : Apr 24, 2025, 03:41 PM IST
Guardian OTT: ఒక రాయితో జీవితం మొత్తం అల్లకల్లోలం..ఓటీటీలో అలరిస్తున్న హన్సిక హారర్ థ్రిల్లర్..!

Guardian movie Aha: తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించిన నటి హన్సిక మోత్వానీ. తెలుగు వారికి కూడా ఈ హీరోయిన్ సుపరిచితురాలు. దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో కనిపించి మెప్పిచ్చింది. 

Add Zee News as a Preferred Source

ఇక ఈ మధ్య ముఖ్యంగా హీరోయిన్ ప్రాధాన్యత ఉంది చిత్రాలలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా హన్సిక ప్రధాన.. పాత్రలో నటించిన సినిమా ‘గార్డియన్’ ఈ మధ్యనే తమిళంలో విరుదలై మంచి రెస్పాన్స్ ఇవ్వడం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ వేదిక ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది. మర్చ్ 8, 2024న తమిళంలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 

అపర్ణ అనే యువతికి (హన్సిక) అదృష్టం చాలా తక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుంచే ఏ పని చేయాలన్నా అడ్డంకులు ఎదురవుతుంటాయి.  ప్రేమలోనూ విఫలమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఓ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టులో భాగంగా అపర్ణకు ఒక ప్రత్యేకమైన క్రిస్టల్ దొరుకుతుంది.

ఆ రాయి దొరికిన తరువాత అపర్ణ జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. ఆమె కోరుకున్న ప్రతీదీ నిజమవుతుంది. మంచి ఉద్యోగం, ప్రేమికుడితో మళ్లీ కలయిక, కొత్త అవకాశాలు ఇవన్నీ వరుసగా ఎదురవుతాయి. అయితే, ఈ అద్భుత మార్పుల వెనక ఉన్న రహస్యం.. క్రిస్టల్ అనే అనుమానం అపర్ణకు పుట్టుతుంది.

ఇక అక్కడి నుంచి..కథ ఉత్కంఠ భరితంగా మారుతుంది. మిస్టరీ, ఆత్మలు, రివేంజ్ డ్రామా అన్నీ కలసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా ఈ సినిమా మొత్తం సాగుతుంది. మీరా అనే ఆత్మ పాత్ర ద్వారా కథ మరింత ఆసక్తిగా సాగుతుంది. ముఖ్యంగా ఫిమేలలీడ్‌తో ఇలాంటి కథను తీసిన విధానం ప్రత్యేకంగా నిలిచే అంశం.

సామ్ సి.ఎస్. అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది. కె.ఏ. శక్తివేల్ సినిమాటోగ్రఫీ కథకు మరింత ప్లస్గా నిలిచింది. దర్శకుడు శబరి గురు శరవణన్ ట్రీట్‌మెంట్ ఈ హారర్ థ్రిల్లర్‌కు కొత్తగా అనిపిస్తుంది. మరెందుకు ఆలస్యం ఈ సినిమాని ఇప్పుడే ఆహాలో.. చూసేయండి.

Read more: Navy Officer Couple Dance Video: పెళ్లి తర్వాత భార్యతో ఆర్మీ అధికారి డ్యాన్సులు.. ఎంత చక్కగా చేశారో..?.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News