HBD Allu Arjun: మాములు నటుడి నుంచి ప్యాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ నట ప్రస్థానం..

HBD Allu Arjun:  అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు హీరో కాదు. పుష్ప సిరీస్ తో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ముఖ్యంగా బన్ని స్టార్ ఇమేజ్ వెనకాల  మెగా అండ్ అల్లు అనే పెద్ద బ్యాక్ గ్రౌండ్ వుంది. ఆ బ్యాక్ గ్రౌండ్ ఎంట్రీ వరకు ఉపయోగించుకొని ఇపుడు ఇంట గెలిచి..రచ్చ చేస్తున్నాడు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 8, 2025, 12:00 AM IST
HBD Allu Arjun: మాములు నటుడి నుంచి ప్యాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ నట ప్రస్థానం..

HBD Allu Arjun:  మెగా కాంపౌండ్ అనే ట్యాగ్ తో ఎంట్రీ ఇచ్చి.. ఇపుడు ఆ ముద్రను చెరిపేసుకొని తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. అంతేకాదు మెగా హీరోలందరినీ క్రాస్ చేసి ప్యాన్ ఇండియా స్టార్ గా హిందీలో ఇండస్ట్రీ హిట్ నమోదు చేసిన హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చేసినవి కొన్ని చిత్రాలైనా.. తనదైన నటన, డాన్సింగ్, పోరాట సన్నివేశాల‌తో తెలుగులో  తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతింతై అన్నట్టు వెనకాల  మెగా అల్లు వంటి  కుటుంబ అండదండలు వున్నా.. నటుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

Add Zee News as a Preferred Source

ముఖ్యంగా 22 యేళ్ల క్రితం  గంగోత్రి సినిమాతో హీరోగా మొదలైన నట ప్రస్థానం ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. అల్లు రామలింగయ్య మనవడిగా.. అల్లు అరవింద్ తనయుడిగా.. మెగాస్టార్ అల్లుడిగా  అల్లు అర్జున్ వెండితెర ఎంట్రీకి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగింది. అల్లు అర్జున్.. 1982లో ఏప్రిల్ 8న అల్లు అరవింద్, నిర్మల దంపతలుకు రెండో పుత్రుడిగా జన్మించారు. బాల నటుడిగా  చిరంజీవి హీరోగా ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నటించిన 'విజేత'లో బాల నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. అంతేకాదు కమల్ హాసన్ స్వాతిముత్యంలో కూడా బాలనటుడిగా  నటించాడు.

ఇదీ చదవండి:  Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..

ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
 
ఆ తర్వాత కొన్నేళ్లకు చిరంజీవి హీరోగా నటించిన 'డాడీ'లో చిన్న క్యారెక్టర్ లో మెరిసాడు. ఇక అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చినపుడు ఎవరీ కుర్రాడు మరీ ఇలా ఉన్నాడు..? బ్యాగ్రౌండ్ ఉంటే హీరో అయిపోవచ్చా.. అనే విమర్శలు ఎదర్కొన్నాడు.  పేడి ముఖం వాడిని ఆడియన్స్ పై  రుద్దడమేనా అని కామెంట్స్ వినిపించాయి. బహుశా తెలుగులో మరే నట వారసుడిపై ఈ రేంజ్ ట్రోల్స్ రాలేదనే చెప్పాలి. గంగోత్రి సినిమా చూసిన వాళ్లు వీడేంటి ఇలా ఉన్నాడు అన్న వాళ్లే.. ఆ తర్వాత అల్లు అర్జున్ ను చూసి హీరో అంటే ఇలా ఉండాలి అని తన మేకోవర్ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.  

గంగోత్రి హీరోగా మొదలైన అల్లు అర్జున్ నట జీవితం.. పుష్ప 2 వరకు నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. ఇక 2021 యేడాది గాను పుష్ప సినిమాలోని యాక్టింగ్ కు బెస్ట్ యాక్టర్ గా రికార్డు క్రియేట్  చేశాడు.  అంతేకాదు పుష్ప ఫస్ట్ పార్ట్ తో తెలుగు నుంచి మొదటి సారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు.మన దగ్గర ఎంతో మంది మంచి నటులున్నా.. కొన్ని రాజకీయాలు, ఇతరత్రా కారణాల వల్ల వాళ్లకు ఆ అవార్డు రాలేదు. దీంతో వాళ్లు బెస్ట్ యాక్టర్స్ కాదని చెప్పలేము. కానీ అల్లు అర్జున్ ఈ అవార్డు అందుకొని సత్తా చాటాడు. అంతేకాదు సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచి అత్యధిక ఇన్ స్టాగ్రామ్  ఫాలోవర్స్ ఉన్న హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్ .. అల్లు అర్జున్ పై ఓ డాక్యుమెంటరీ చేసింది.

మన దేశంలో ఈ ఘనత అందుకున్న తొలి హీరో అల్లు అర్జున్ కావడం విశేషం. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రిటీల మైనపు విగ్రహాలను పెట్టే మేడమ్ టుస్సాడ్స్‌ మ్యూజియంలో  అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లో పెట్టారు. గతేడాది చివర్లో పుష్ప 2 మూవీతో పలకరించి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో పౌరాణిక మూవీలో నటించబోతున్నాడు. శివుడి కుమారుడైన కుమార స్వామి జీవితంపై ఈ సినిమా రాబోతుంది. మరోవైపు అట్లీ దర్శకత్వంలో తొలిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. అటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. దీంతో పాటు పలు ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో పాటు పుష్ప 3 మూవీ ఉండనే ఉంది.  మరోవైపు త్వరలో పుష్ప 3 మూవీతో పలకరించబోతున్నారు. మొత్తంగా ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న అల్లు అర్జున్ కు జీ న్యూస్ బర్త్ డే విషెస్ చెబుతుంది.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News