)
HBD Prabhas: ప్రభాస్. సిల్వర్ స్క్రీన్ మీద ఏక్ నిరంజన్ లా దూసుకుపోతున్న మిస్టర్ పర్ ఫెక్ట్. టాలీవుడ్ సహా భారతీయ బాక్సాఫిస్ ను షేక్ చేస్తున్న ఛత్రపతి. మాస్ ప్రేక్షకులకు రెబల్. క్లాస్ ఆడియన్స్ కు డార్లింగ్. తెలుగులో తిరుగులేని ఇమేజ్.. ప్యాన్ ఇండియా లెవల్లో ఎవరికీ లేని క్రేజ్ ఈ రోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా జీ తెలుగు న్యూస్ స్పెషల్ స్టోరీ. ప్రభాస్ అంటేనే ముందుగా మనకు అరడుగుల హైట్ గుర్తుకు వస్తుంది. ఆ హైట్ కు తగ్గ పర్సనాలిటి.. ఆ పర్సనాలిటి తగ్గ వాయిస్. ఇవే ప్రభాస్ ను హీరోగా టాప్ లో నిలబెట్టాయి. హ్యాండసమ్ పర్సనాలిటీతోనే కాదు...తనదైన యాక్షన్ తో...భారత దేశ వ్యాప్తంగా హీరోగా స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఒకపక్క మిస్టర్ ఫర్ఫెక్ట్ గా సిల్వర్ స్క్రీన్ మీద అలరిస్తూనే.. మరో పక్క మిర్చిలా రికార్డుల ఘాటును సినిమా సినిమాకు పెంచుతున్నాడు. రెబల్ స్టార్ ప్రతి సినిమాకు ఫ్రెష్ లుక్ లో కనిపించడానికి ప్రయత్నిస్తున్నాడు రెబల్ స్టార్. కసి, కోపం, ప్రేమ, యాక్షన్, ఎమోషన్ సీన్ ఏదైనా.. ఎంతో ఈజ్ తో చేయడం ప్రభాస్ స్పెషాలిటి. త్వరలో ‘ది రాజా సాబ్’ మూవీతో పలకరించబోతున్నాడు. అటు ఫౌజీగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.
రెబల్ ఫ్యాన్స్ కు ఈ సారి దీపావళితో పాటు ఆయన పుట్టినరోజును దీపావళిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కు దేశ వ్యాప్తంగానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. రెబల్ స్టార్ సినిమాలకు ఆయా దేశాల్లో వచ్చే బాక్సాఫీస్ కలెక్షన్స్ ప్రభాస్ యూనివర్సల్ క్రేజ్ కు నిదర్శనంగా నిలుస్తుంటాయి. అందుకే ప్రభాస్ చేసే ప్రతి సినిమా ట్రూ పాన్ వరల్డ్ చిత్రంగా ప్రేక్షకులు ఎదురు చూసేలా ఉంటుంది.
ప్రభాస్ స్టార్ డమ్.. నటన.. తెరపై కనిపించే విధానం.. రికార్డ్ స్థాయి బాక్సాఫీస్ వసూళ్లతో ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చారు. ఇక ప్రభాస్ సినిమా హిట్టైయిందంటే.. బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు పక్కా అని చెప్పాలి. ఇండస్ట్రీలో పేరు తెచ్చుకునే హీరోలను చూస్తుంటాం...టాలీవుడ్ కే పేరు తెస్తున్న అరుదైన స్టార్ గా రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పాలి. మన దేశంలో తొలి ప్యాన్ ఇండియా స్టార్ గా అదే ఇమేజ్ ను కంటిన్యూ చేస్తూ వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. ఈ నెల 31న ప్రభాస్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన ‘బాహుబలి ది ఎపిక్’ రీ రిలీజ్ అవుతోంది. బాహుబలి రెండు చిత్రాలు కలిసి ఒకే పార్ట్ గా విడుదల చేస్తుండంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఈ మూవీ చూడడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు.
తెలుగువారు గర్వపడేలా ప్రభాస్ భారీ పాన్ వరల్డ్ మూవీ లైనప్ కంటిన్యూ చేస్తున్నారు. డైరెక్టర్ మారుతితో ప్రభాస్ చేస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా వచ్చే సంక్రాంతికి జనవరి 9న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ‘ది రాజా సాబ్’ చిత్రంలో ప్రభాస్ ను మనం ఇంతకాలం మిస్ అయిన వింటేజ్ లుక్ లో రొమాంటిక్ హారర్ కామెడీలో చూడబోతున్నాము. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
డైరెక్టర్ హను రాఘవపూడి, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ లో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న స్పిరిట్ సినిమాపై ఇప్పటికే ఆకాశమే హద్దుగా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ క్రేజీ లైనప్ లో రానున్న సలార్ 2, కల్కి 2 లైన్ లో ఉన్నాయి. ఈ ఏడాది మంచు విష్ణు కన్నప్ప సినిమాలో ప్రభాస్ చేసిన రుద్ర క్యారెక్టర్ ఆ చిత్రానికే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రుద్ర పాత్రలో ప్రభాస్ చేసిన భక్తితో కూడిన పాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇక ప్రభాస్ వచ్చే పుట్టినరోజు వరకైనా.. ఒకింటివాడు కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మచ్చలేని జీవితం, అజాత శత్రువుగా సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చేతికి ఎముకలేని దాతృత్వం..తన ఇంటికి షూటింగ్ కు మర్చిపోలేని ఆతిథ్యం...ఇవన్నీ ప్రభాస్ ను అందరూ ఇష్టపడే డార్లింగ్ లా మార్చేశాయి. స్టార్ గా ప్రభాస్ స్టామినా బాక్సాఫీస్ రికార్డులు చెబితే.. అందరూ ప్రేమగా పిలిచే డార్లింగ్ అనే మాట వ్యక్తిగా ఆయన గొప్పదనం చూపిస్తుంది. తెలుగు తెరపై వరుస విజయాలతో ప్రభాస్ మరెన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటోంది జీ తెలుగు న్యూస్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.