Hari Hara Veera Mallu Release Date: హరిహర వీరమల్లు విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడంటే..!

Pawan Kalyan Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ అభిమానులకు ఫైనల్ గా శుభవార్త వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు విరుదల తేదీ ఖరారు అయింది. ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అంటే..?

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 16, 2025, 02:24 PM IST
Hari Hara Veera Mallu Release Date: హరిహర వీరమల్లు విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడంటే..!

Hari Hara Veera Mallu Update : తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ నటించిన "హరి హర వీరమల్లు" సినిమా గురించి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎన్నో వాయిదాల అనంతరం ఈ చిత్రానికి తాజాగా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. జూన్ 12, 2025నే ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

ఈ చిత్రం షూటింగ్ చాలా కాలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మధ్యలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకోవాల్సిన వచ్చినందువల్ల.. ఈ చిత్రం మరింత ఆలస్యం అయింది. దీంతో అనేక తేదీలు మారుతూ.. ఈ సినిమా విడుదల పవన్ కళ్యాణ్ అభిమానుల్లో నిరాశ తీసుకొచ్చింది. ఫైనల్ గా ఇప్పుడు మళ్లీ తాజా పోస్టర్‌తో ఊపందుకుంది. తాజా సమాచారం ప్రకారం, చిత్రీకరణ పూర్తయిన నేపథ్యంలో ఎలాంటి ఆటంకం లేకుండా.. ఈ సినిమా జూన్ 12న.. విడుదలకు సిద్ధమవుతోంది.

చరిత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు గొప్ప వినోదాన్ని అందించనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్, సెట్స్, స్టోరీటెల్లింగ్ విషయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పవన్‌ మీ అభిమానులనే కాకుండా.. సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఉంటుంది అది సమాచారం.

అయితే ఇప్పటికే ఈ చిత్రం పలుసార్లు వాయిదా పడడం వల్ల.. ఇప్పటికైనా ఈ సినిమా.. వాయిదా పడకుండా విడుదల కావాలని.. ఆశిస్తున్నారు అభిమానులు. గతంలో వచ్చిన వాయిదాల నేపథ్యంలో ఈ తేదీపై కొంత అనుమానం ఉన్నా.. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కావడంతో.. ఈసారి విరుదల తప్పకుండా వాయిదా పడదు అని ఆశిస్తున్నారు.

ఇక ఈ చిత్రంతో పాటు పవన్ కళ్యాణ్ మరెన్నో సినిమాలు కూడా విడుదల కావలసి ఉన్నాయి. ముఖ్యంగా సుజిత్ దర్శకత్వంలో రానన్న ఓజీ చిత్రంపై కూడా ఎన్నో ఆశలు ఉన్నాయి. మరి ఈ సినిమా షూటింగ్ పూర్తయి ఎప్పుడు విడుదలవుతుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక మరో పక్క దర్శకుడు హరీష్ శంకర్ తో కూడా త్వరలోనే సినిమా మొదలుపెట్టనున్నారు పవన్. మొత్తం మీద అటు సినిమాలతో ఇటు రాజకీయాలతో తెగ బిజీగా ఉన్నారు ఈ హీరో.

Read more: BSF Jawan Tortured in Pak custody: భారత్ జవాన్‌కు పాక్ రెంజర్ల చిత్రహింసలు.. షాకింగ్ విషయాలు బైటపెట్టిన బీఎస్ఎఫ్ జవాన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News