Harish Shankar Intresting Reply to Fan: తెలుగు టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్న హరీష్ శంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న ఆయన ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయడంతో పెద్ద ఎత్తున అభిమానుల నుంచి ఆయన మీద ప్రశంసల వర్షం కురుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో ఒక అభిమాని ఆయనను ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ కి ఆయన రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక నెటిజన్ ట్వీట్ చేస్తూ ‘’అన్నా మొదటిసారి గిల్టీగా ఫీల్ అవుతున్న, సారీ అన్నా మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం, ఒక్క గ్లింప్స్ తో మా అందరి నోళ్లు మూపించావు మా ఆనందం ఇప్పుడు మాటల్లో చెప్పలేను థాంక్యూ అన్నా, బ్లాక్ చేసిన ఫ్యాన్స్ ని అన్ బ్లాక్ చెయ్ అన్న ప్లీజ్ అండ్ ట్వీట్ చేశారు.


Also Read: Actor Naresh on Marriage : 'పవిత్ర'తో పెళ్లి అయిపోయిందా.. నరేష్ అసలు విషయం చెప్పేశాడుగా!


ఇక వెంటనే ఆ ట్వీట్ కి హరీష్ శంకర్ రిప్లై ఇస్తూ మనలో మనకు గిల్టీ ఏంటి తమ్ముడు మనందరం ఒకటే, సినిమాని ఎంజాయ్ చేద్దాం, బూతులు యూస్ చేసిన వాళ్ళని మాత్రమే బ్లాక్ చేశా నేనెప్పుడూ విమర్శలను స్వాగతిస్తూనే ఉంటాను అన్నట్లుగా హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ చేసేది తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన విజయ్ తేరి సినిమా రీమేక్ అని తెలియడంతో కొన్నాళ్ల క్రితం హరీష్ శంకర్ ను పవన్ ఫ్యాన్స్ దారుణంగా టార్గెట్ చేసి ఒక రేంజ్ లో ఆడుకున్నారు.



ఈ నేపథ్యంలో అప్పట్లో హరీష్ శంకర్ కూడా మీకు అలుసు ఇవ్వడం నాది తప్పు, అలుసిస్తే నన్ను ఆడుకుంటున్నారు అనే విధంగా చాలా మందిని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్  రిలీజ్ కావడంతో ఒక్కసారిగా హరీష్ శంకర్ మీద ప్రశంసల వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఒక అభిమాని ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేయగా హరీష్ శంకర్ లేదని కొట్టిపారేశారు.


Also Read: Keerthy Suresh Photos: అప్పుడే ఏడాది అంటూ ఆ హాట్ ఫోటోలు షేర్ చేసిన కీర్తి సురేష్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook