MS Ilayaa: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో 'మిస్ ఇళయా'.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం

MS Ilayaa Movie Updates: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మిస్ ఇళయా మూవీ తెరకెక్కుతోంది. వేముల జి దర్శకత్వం వహిస్తుండగా.. కుషాల్ జాన్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. త్వరలోనే తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది.  

Last Updated : Feb 8, 2025, 11:35 AM IST
MS Ilayaa: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో 'మిస్ ఇళయా'.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం

MS Ilayaa Movie Updates: కుషాల్ జాన్ హీరోగా.. వేముల జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'మిస్ ఇళయా' (Ms.ILAYAA). కాస్మిక్ పవర్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ మట్టా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. సహ నిర్మాత చాహితీ ప్రియా సమర్పిస్తుండగా.. తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి చిత్రబృందంతోపాటు కొంతమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి దింటకుర్తి మురళీ కృష్ణ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు వేడకగా జరిగాయి. ఈ సందర్భంగా హీరో కుషాల్ జాన్ మాట్లాడుతూ.. ఈ సినిమా స్టోరీ వినగానే చాలా ఆసక్తిగా అనిపించిందని చెప్పారు. తాను ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఇదే తొలిసారి అని చెప్పుకొచ్చారు. తాను ఇలాంటి పాత్రలో యాక్ట్ చేయడం ఇదే మొదటిసారి అని.. తన కెరీర్‌లో ప్రత్యేకమైన స్థానం సంపాదించే మూవీ అవుతుందని నమ్ముతుందని అన్నారు. ప్రేక్షకుల ఆదరణ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు.

Add Zee News as a Preferred Source

దర్శకుడు వేముల జి మాట్లాడుతూ.. వినూత్నమైన స్టోరీతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఆడియన్స్‌ను అలరించే అన్ని అంశాలు మూవీలో ఉంటాయన్నారు. హీరో కుషాల్ జాన్‌ ఈ పాత్రకు న్యాయం చేస్తారని నమ్మకంగా తాను చెప్పగలనని అన్నారు. తాము ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. 

అనంంతరం నిర్మాత మట్టా శ్రీనివాస్ మాట్లాడుతూ.. సహ నిర్మాత చాహితీ ప్రియా ఈ సినిమా కోసం ఎంతో అన్వేషణ చేశారని తెలిపారు. ఎంతో ఆలోచించి మంచి కథను ఎంపిక చేసుకున్నామన్నారు. సినిమాను తగినట్లు టెక్నీకల్ టీమ్, టాలెంటెడ్ యాక్టర్స్‌తో రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రేక్షకులను తప్పకుండా మెప్పించే సినిమా అవుతుందని నమ్మకం ఉందన్నారు. త్వరలోనే మొదటి షెడ్యూల్ ప్రారంభిస్తామన్నారు. మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. 

Also Read: Delhi Exit Poll 2025: ఢిల్లీ మరోసారి ఆమ్‌ఆద్మీ పార్టీదే!.. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల సరళి ఇదే

Also Read: Delhi Exit Polls: బీజేపీకి జై కొట్టిన ఢిల్లీ ఓటర్లు.. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత కమల వికాసం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News