
Prithviraj, Supriya Menon: హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు సినిమా సలార్ తో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మలయాళంలో కెరీర్ ప్రారంభించిన ఆయన నటన, దర్శకత్వం మరియు స్క్రీన్ ప్రెజెన్స్ తో తమిళం, తెలుగు, హిందీ భాషలలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. పృథ్వీరాజ్ ఇప్పటి వరకు వందకు పైగా చిత్రాలలో నటించి ఆడియన్స్‌ని మెప్పించాడు. పృథ్వీరాజ్ సుకుమారన్, సుప్రియా మీనన్.. ఇండస్ట్రీ క్యూట్ కపుల్స్‌లో వీరు కూడా ఒకరు. అయితే వీరిద్దరూ నాలుగేళ్లు ప్రేమించుకొని ఆ తర్వాత పెద్దల సమక్షంలో 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడ ఉంది. సుప్రియా.. పృథ్వీరాజ్‌కు ఎంతో సపోర్టివ్‌గా ఉంటుంది. పృథ్వీరాజ్ కూడా తన భార్యకు ఎంతో రుణపడి ఉన్నానని చాలా సార్లు ఓపెన్‌గా చెప్పాడు.
గతంలో జర్నలిస్ట్‌గా వర్క్ చేసిన సుప్రియా.. ఇప్పుడు పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్‌కి కో-ఫౌండర్‌గా ఉంటూ తన బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉండే సుప్రియా మీనన్‌కు.. ఇన్‌స్టాలో 1 మిలియన్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అయితే తాజాగా సుప్రియా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఆ పోస్ట్‌లో ఏముందంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మహిళ నన్ను 2018 నుంచి వేధిస్తుందని.. అంతేకాకుండా ఉద్దేశపూర్వకంగానే నా గురించి, నేను పెట్టే పోస్ట్స్ గురించి చాలా అసభ్యకరమైన కామెంట్స్ పెడుతుంది. ఆ మహిళ ఫోటోని షేర్ చేస్తూ.. ఇన్‌స్టాలో ఏ ఫిల్టర్ కూడా ఆమెకు తనపై ఉన్న ద్వేషాన్ని కప్పిపుచ్చలేకపోతోంది. ఆ మహిళ గురించి 2018 నుండి నాకు తెలుసు.. అయితే ఆమెకు ఒక చిన్న పిల్లాడు ఉండటం వల్ల నేను ఇప్పటివరకూ సహనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు ఆ మహిళ ట్రోలర్ నా ఫాదర్ గురించి కూడా ఇబ్బందికర వ్యాఖ్యలు చేసింది.
ఇప్పటికీ ఎన్నోసార్లు ఆమె అకౌంట్‌ని నేను బ్లాక్ చేశాను. అయిన కూడా ఆమె న్యూ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటూ నన్ను బాధపెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆమె కొత్తగా క్రియేట్ చేసే ప్రతి అకౌంట్‌ని బ్లాక్ చేయడమే నా డైలీ రొటీన్ అయింది. ఇలా తను ఎంత మానసిక వేదనను అనుభవిస్తుందో సుప్రియా తెలిపింది. ఆ మహిళ ట్రోలర్ గురించి ఆరా తీయగా ఆమె అమెరికాలో నివసిస్తున్న ఒక మలయాళీ నర్స్. పేరు క్రిస్టినా ఆల్డో అలియాస్ క్రిస్టినా బాబు కురియన్. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ సుప్రియాకి మద్దతుగా కామెంట్స్ పెడుతూ.. సదరు మహిళ ట్రోలర్ అకౌంట్‌కి రిపోర్ట్ కొడుతున్నారు.
ఇక పృథ్వీరాజ్ సినిమాల విషయానికి వస్తే రీసెంట్గా రిలీజ్ అయిన ఎంపురాన్ 2 (Empuran 2) మంచి హిట్ అందుకుంది. ఈ పొలిటికల్ డ్రామా రూ. 260 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. మలయాళ సినీ చరిత్రలో హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా నిలిచింది. ప్రస్తుతం పృథ్వీరాజ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ పార్ట్ 2లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాకాండా S.S. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న SSMB29లోనూ పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook