
Maathru Movie: తల్లి అనుబంధంతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. మాతృ దేవోభవ నుంచి బిచ్చగాడు వరకు ఎన్నెన్నో కల్ట్ క్లాసిక్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇదే తల్లి అనుబంధంతో సినీ పరిశ్రమలో మరో సినిమా రాబోతున్నది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు హృదయాన్ని హత్తుకుంటుండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చింది. ఇంతకీ ఆ సినిమా ఏమిటి? నటీనటులు ఎవరు? అనేవి తెలుసుకుందాం.
హీరో శ్రీరామ్, నందినీ రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మాతృ'. జాన్ జక్కీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాతృ సినిమాను శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై శ్రీ పద్మ సమర్పణలో బి. శివ ప్రసాద్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పాటలు విడుదలయ్యాయి. త్వరలోనే విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి.
మాతృ పేరుకు తగ్గట్టుగా సాగే తల్లి అనుబంధంతో భావోద్వేగంతో కూడిన పాట 'అపరంజి బొమ్మ.. మా అమ్మ' విడుదలైంది. ఈ పాటను దినేశ్ రుద్ర ఆలపించగా హీరో శ్రీరామ్ తన నటనతో కన్నీళ్లు పెట్టించాడు. అపరంజి బొమ్మ పాటకు నిర్మాత బి. శివ ప్రసాద్ సాహిత్యం అందించడం విశేషం. మిగతా పాటలకు శేఖర్ చంద్ర అందించిన సాహిత్యం హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఈ చిత్ర బృందాన్ని ఆస్కార్ విజేత రచయిత చంద్రబోస్ అభినందించారు. 'మంచి కథాంశంతో వస్తున్న మాతృ సినిమా విజయం సాధించాలి. పాటలు అన్ని బాగున్నాయి. సంగీతం, సాహిత్యం చక్కగా కుదిరింది' అని తెలిపారు. చిత్ర యూనిట్ సభ్యులందరికి శుభాశీస్సులు.. సినిమా మంచి విజయం పొందాలని రచయిత చంద్రబోస్ ఆకాంక్షించారు.
ఇక మాతృ సినిమా నుంచి 'చూస్తున్నావేమో', 'ఏదేదో చెయ్యమంటోంది', 'మల్లె పూల వాసనె' పాటలు ఆదరణ పొందుతున్నారు. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందించగా.. రాహుల్ శ్రీ వాత్సవ్ కెమెరామెన్‌గా, సత్యనారాయణ బల్లా ఎడిటర్‌గా పని చేశారు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసి.. కొన్ని వారాల్లో చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook