Hero Srikanth Varisu Movie : వారసుడులో అలాంటి సీన్లుంటాయి.. హీరో శ్రీకాంత్ కామెంట్స్ వైరల్
Thalapathy vijay Varisu Movie దళపతి విజయ్ వారిసు సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తెలుగు నటీనటులు ఎక్కువ మంది ఉన్నారు. హీరో శ్రీకాంత్ తాజాగా వారిసు సినిమా గురించి విశేషాలు చెప్పుకొచ్చాడు.
Hero Srikanth Varisu Movie దళపతి విజయ్ సినిమాలకు కోలీవుడ్, టాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఇప్పుడు వారిసు అంటూ తమిళంలో విజయ్ సందడి చేయబోతోన్నాడు. అదే సినిమాను తెలుగులో వారసుడు అంటూ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ ముఖ్య పాత్రను పోషించాడు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ వారిసు గురించి శ్రీకాంత్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.
బ్రదర్స్ మధ్య జరిగే ఎమోషన్స్ ఇందులో ఉంటాయని, బ్రదర్స్ మధ్య ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అవే ఉంటాయని అన్నాడు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా వుంటుందని, వంశీ పైడిపల్లి సినిమాల్లో గ్రేట్ ఎమోషన్స్ వుంటాయని శ్రీకాంత్ తెలిపాడు. ఈ సినిమాను చేయడం చాలా ఆనందంగా వుందని, విజయ్ కి అద్భుతమైన క్రేజ్ వుందని ఈ మధ్య కాలంలో ఆయన కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ చేయలేదని శ్రీకాంత్ అన్నాడు.
విజయ్‌ని ఇంత కుముందు కొన్ని వేడుకల్లో కలిశానని, కలిసి పని చేయడం ఇదే తొలిసారి అని శ్రీకాంత్ తెలిపాడు. విజయ్ చాలా సైలెంట్‌గా ఉంటాడని, ఎక్కువగా మాట్లాడరని అన్నాడు. కేరవ్యాన్ కూడా వాడరని, సెల్ ఫోన్ కూడా దగ్గర ఉండని చెప్పుకొచ్చాడు. ఒకసారి సెట్‌లో అడుగు పెడితే ప్యాకప్ చెప్పేంత వరకు అక్కడి నుంచి కదలడని చెప్పుకొచ్చాడు.
తనకు, విజయ్‌కి మధ్య సెంటిమెంట్, ఎమోషన్స్, పోటాపోటీ సీన్స్ ఉన్నాయని, ఒక ఫ్యామిలీ లో అన్నదమ్ముల మధ్య ఎలాంటి పరిస్థితులు, గొడవలు ఉంటాయో అలాంటి సీన్స్ ఉంటాయని శ్రీకాంత్ అన్నాడు. వంశీ పైడిపల్లి చాలా క్లారిటీ వున్న దర్శకుడని, ఫిలిం మేకింగ్ లో చాలా పెర్ఫెక్షన్ వుంటుందని, ఎక్కడా రాజీపడకుండా తీస్తారని ప్రశింసించాడు.
Also Read: Rakul Preet Pics : రకుల్ బీచ్ ఫోటోలు.. న్యూ ఇయర్ హ్యాంగవుట్.. పిక్స్ వైరల్
Also Read: Sreeja Konidela : ఆ వ్యక్తిని కనుగొన్నా.. కొత్త జీవితానికి ఆరంభం ఇదే.. శ్రీజ కొణిదెల పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి