The Great Pre Wedding Show: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి అదిరిపోయే రెస్పాన్స్.. తిరువీర్ దశ తిరిగిందిగా..!

The Great Pre Wedding Show: హీరో తిరువీర్ మరో హిట్ అందుకున్నాడు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన తిరువీర్.. సహజమైన కామెడీతో తెగ నవ్వించేస్తున్నాడు.   

Last Updated : Nov 9, 2025, 10:54 PM IST
The Great Pre Wedding Show: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి అదిరిపోయే రెస్పాన్స్.. తిరువీర్ దశ తిరిగిందిగా..!

The Great Pre Wedding Show: 2016లో బొమ్మల రామారం మూవీతో నటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తిరువీర్.. 2022లో మసూద సినిమాతో హీరోగా మారాడు. ఘాజీ, ఏ మంత్రం వేసావె, శుభలేఖలు తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువ కాగా.. జార్జ్ రెడ్డి, పలాస సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. నేచురాల్ నాని టక్ జగదీష్ మూవీలో విలనిజంతో అదరగొట్టాడు. హీరోగా మసూద సినిమాతో హిట్ అందుకోవడంతో వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. 2023లో పరేషాన్ మూవీతో మరోసారి నటనకు మంచి మార్కులు కొట్టేశాడు. తాజాగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసారి బాక్సాఫీసు వద్ద సినిమాల సందడి గట్టిగానే ఉన్నా.. ఈ మూవీకి మాత్రం పాజిటివ్‌ టాక్ వచ్చింది.

Add Zee News as a Preferred Source

ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో వచ్చిన బెస్ట్ కామెడీ సినిమాగా ఆడియెన్స్ మెచ్చుకుంటున్నారు. ఎలాంటి డబుల్ మినింగ్ డైలాగ్స్‌ లేకుండా.. బూతుల జోలికి వెళ్లకుండా సహజమైన కామెడీతో నవ్వించారు. ముఖ్యంగా ⁠హీరో తిరువీర్ తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడని చెబుతున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బుకింగ్స్ పెరిగాయని మేకర్స్ చెబుతున్నారు. ⁠ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయని.. తప్పకుండా థియేటర్స్‌లో చూడాలని కోరుతున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ షో మూవీ ఒక నవ్వుల బంతి భోజనం అని అంటున్నారు.

కథ ఏంటంటే..?

ఓ ఫోటో స్టూడియోను నడిపించే హీరో.. పొలిటిషియన్‌కు పెళ్లికి సంబంధించి ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాడు. షూట్ చేసిన ఈ ఫుటేజ్ అంతా ఓ చిప్ ఉంచగా.. తన అసిస్టెంట్ దానిని పోగడతాడు. ఇక్కడి నుంచి అసలు స్టోరీ మొదలు అవుతుంది. ఆ చిప్ గురించి అడిగినప్పుడల్లా ఏదో సాకు చెప్పి తప్పించుకునే హీరో.. తన లవర్‌తో కలిసి మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఏకంగా ఆ పెళ్లినే ఆపేస్తే చిప్ అడగడు కదా అనుకుని.. చాలా ప్రయత్నాలే చేస్తాడు. ఈ క్రమంలో హీరో చేసే పనులన్ని నవ్వులు పూయిస్తాయి. చివరకు పెళ్లి ఎలా ఆగిపోయింది..? ఆ చిప్ దొరికిందా..? అనేది తెలియాలంటే తప్పకుండా ప్రీ వెడ్డింగ్ షో మూవీ చూడాల్సిందే. 

Also Read: Money Saving Tips: పొదుపు చేసే భార్య ఉంటే.. ప్రతి భర్తా లక్కీభాస్కరుడే.. మీ భార్యలో ఈ పొదుపు లక్షణాలు ఉంటే.. మీరు కోటీశ్వరుడు అవ్వడం పక్కా..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

Trending News