Madhuram Movie: టెన్త్ క్లాస్ అమ్మాయి-9th క్లాస్ అబ్బాయి ప్రేమించుకుంటే..! బ్యూటీఫుల్ లవ్‌స్టోరీతో 'మధురం'

Madhuram Movie Updates: ఎ మెమొరబుల్ లవ్ అంటూ ఆడియన్స్‌ను అలరించేందుకు వస్తోంది మధురం మూవీ. రేపు (శుక్రవారం) సినిమా విడుదల కానుండగా.. హీరో ఉదయ్ రాజ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 17, 2025, 07:28 PM IST
Madhuram Movie: టెన్త్ క్లాస్ అమ్మాయి-9th క్లాస్ అబ్బాయి ప్రేమించుకుంటే..! బ్యూటీఫుల్ లవ్‌స్టోరీతో 'మధురం'

Madhuram Movie Updates: RRR, ఆచార్య వంటి క్రేజీ సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మెప్పించిన ఉదయ్ రాజ్.. మధురం అనే సినిమాతో హీరోగా పరిచయం కానున్నాడు. శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఎం.బంగార్రాజు నిర్మించిన ఈ మూవీలో వైష్ణవి సింగ్ హీరోయిన్‌గా నటించింది. రాజేష్ చికిలే దర్శకత్వంలో ‘ఎ మెమొరబుల్ లవ్’ ట్యాగ్ లైన్‌తో టీనేజ్ లవ్ స్టోరీగా రూపొందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 18న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో ఉదయ్ రాజ్ మూవీ విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

Add Zee News as a Preferred Source

తాను మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చానని.. ఆచార్య సినిమా షూటింగ్ టైమ్‌లో ఆయన మాట్లాడడం చాలా మంచి అనుభవమని అన్నారు. 12 ఏళ్లుగా తాను ఇండస్ట్రీలో ఉంటున్నానని.. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌గా పని చేశానని తెలిపారు. చాలా సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా యాక్ట్ చేశానని.. ప్రొడ్యూసర్ బంగార్రాజు సపోర్ట్‌తో ఈ సినిమాలో హీరోగా చేశానని చెప్పారు. డైరెక్టర్ రాజేష్ చికిలేతో తనకు చాలా రోజుల నుంచి పరిచయం ఉందని.. ఆయన కథ చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యాయని అన్నారు.

90's బ్యాక్‌డ్రాప్ స్టోరీ అని.. టెన్త్ క్లాస్ అమ్మాయి-9th క్లాస్ అబ్బాయి మధ్య నడిచే ప్రేమ కథ చాలా అందంగా ఉంటుందన్నారు ఉదయ్ రాజ్. ఈ సినిమాలో తాను మూడు డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపిస్తానని చెప్పారు. ఈ మూడు గెటప్‌ల కోసం చాలా కష్టపడ్డానని.. కొన్ని సీన్స్‌లో చబ్బీగా కనిపిస్తానని అన్నారు. సన్నగా అవ్వడం కోసం కొద్ది రోజులు ఫుడ్ మానేసి.. కేవలం నీళ్లు మాత్రమే తాగనని గుర్తు చేసుకున్నారు. నైంటీస్‌లో స్కూల్స్ ఎలా ఉండేవి..? స్టూడెంట్స్ ప్రవర్తన ఎలా ఉండేది..? వంటి విషయాపై రీసెర్చ్ చేశామన్నారు. ఇందులోని సీన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటాయన్నారు.
 
ఈ మూవీలో హీరోయిన్‌గా తెలుగు అమ్మాయిని తీసుకోవాలని ప్రయత్నించినా కుదరలేదన్నారు. వైష్ణవి సింగ్ చాలా బాగా యాక్ట్ చేసిందని.. మధు, రామ్‌ల ప్రేమాయణమే ఈ మధురం సినిమా అని చెప్పుకొచ్చారు. అందరం కొత్త వాళ్లైనా నిర్మాత బంగార్రాజు ఎంకరేజ్ చేస్తూ చాలా డేరింగ్‌గా నిర్మించారని చెప్పారు. ఈ నెల 18న సినిమాను అందరూ థియేటర్స్‌లో చూసి ఆదరించాలని కోరారు. తాను హీరోనే  కాకుండా ఎలాంటి రోల్స్ అయినా చేయడానికి రెడీగా ఉన్నానని అన్నారు.

Also Read: Lion Video: అడవిలో సింహానికే చుక్కలు చూపించిన గద్దలు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..  

Also Read: Parijata Yog: 62 ఏళ్ల తర్వాత శక్తివంతమైన పారిజాతయోగం.. ఈ రాశుల వారికి కలలో కూడా  ఊహించని జాక్ పాట్..! మీరున్నారా..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News