Sreeleela: స్టార్‌ హీరో కొడుకుతో ప్రేమలో పడ్డ శ్రీలీల? కన్ఫర్మ్ చేసేసిందిగా!

Sreeleela Love With Star Hero Son Here This Is Rumours Or Fact Checkout: సినీ రంగంలోకి ప్రవేశించి విజయవంతమైన హీరోయిన్‌గా గుర్తింపు పొందిన డ్యాన్స్‌ క్వీన్‌ శ్రీలీల ప్రేమలో పడిందనే ప్రచారం కోడై కూస్తోంది. ఓ స్టార్‌ హీరో కొడుకుతో శ్రీలీల ప్రేమాయణం సాగిస్తోందనే వార్తలు వైరల్‌గా మారాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 6, 2025, 08:41 PM IST
Sreeleela: స్టార్‌ హీరో కొడుకుతో ప్రేమలో పడ్డ శ్రీలీల? కన్ఫర్మ్ చేసేసిందిగా!

Sreeleela Love With Star Hero Son: హీరోయిన్ శ్రీలీల క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక అప్పటి నుంచి ఈ తెలుగు హీరోయిన్‌ వెనుతిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది. శ్రీలీల మాస్‌ మహారాజా రవితేజతో కలిసి ధమాకా సినిమా చేసి సూపర్‌ హట్‌ అందుకుంది. ఈ  సినిమాతో శ్రీలీల హీరోయిన్‌గా విశేష గుర్తింపు పొందింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు వెలువెత్తాయి. ఈ క్రమంలోనే స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం, ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాల్లో శ్రీలీల నటించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా శ్రీలీల నటిస్తోంది. తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారిన శ్రీలీల తాజాగా లవ్‌లో పడిందని తెలుస్తోంది.

Add Zee News as a Preferred Source

Also Read: Samantha: 'మాజీ భర్త నాగ చైతన్యతో చేసిన ప్రతి సీన్‌ నాకు గుర్తుంది': హీరోయిన్ సమంత

బాలీవుడ్‌ అరంగేట్రం చేస్తున్న శ్రీలీల అప్పుడే ప్రేమలో పడిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శ్రీలీల బాలీవుడ్ యంగ్ హీరోతో రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం ఖాన్‌తో శ్రీలీల 'దిలర్' అనే మూవీ చేస్తోంది. సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం ఖాన్‌తో శ్రీలీల డేటింగ్ చేస్తున్నట్టు రూమర్స్ వైరల్ అవుతున్నాయి. షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం మరో స్థాయికి వెళ్లిందట. దీంతో అతడితో కలిసి పబ్‌లు, రెస్టారెంట్స్ అంటూ అమ్మడు తెగ తిరిగేస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఇబ్రహీం ఖాన్‌ పుట్టినరోజు నాడు శ్రీలీల షేర్ చేసిన పోస్ట్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: Sreeleela: బాయ్ ఫ్రెండ్ కుటుంబ వేడుకల్లో పాల్గొన్న శ్రీలీల.. వీడియో వైరల్..

ఇబ్రహీం అలీఖాన్‌తో కలిసి ఉన్న ఫొటో షేర్ చేస్తూ శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు రాసింది. ‘హ్యాపీ బర్త్ డే ఇగ్గీ. నువ్వు ప్రపంచానికి ఏం చూపించాలనుకుంటున్నావో దాని గురించి వెయిట్ చేయలేకపోతున్నా.. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే' అంటూ హార్ట్స్ సింబల్‌ను శ్రీలీల షేర్ చేసింది. దీంతో అతడితో శ్రీలీల లవ్‌లో ఉందంటూ బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. మరి దీనిపై శ్రీలీల ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే శ్రీలీల బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో ఓ సినిమా చేస్తుండగా.. తెలుగు, తమిళంలో మరికొన్ని సినిమాలు పట్టాలెక్కాల్సి ఉంది. కాగా కార్తీక్‌ ఆర్యన్‌తో నటించిన సినిమాలో శ్రీలీల లిప్ లాక్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News