Chakri About Nagarjuna: టాలీవుడ్‌లో ‘కింగ్’ అక్కినేని నాగార్జునకి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక పేరు ఉంది.ఇటీవలి కాలంలో ఆయన 'బంగార్రాజు', 'నా సామీ రంగ' వంటి సినిమాలతో బాక్సాఫీస్‌ను చెక్ చేశా మయి. ప్రస్తుతం కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కథలతో, యువ దర్శకులకు ఛాన్స్ ఇస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. ఈ హీరో. రాంగోపాల్ వర్మ లాంటి దర్శకుడికి కూడా మొదట్లోనే ఛాన్స్ ఇచ్చి.. అలాంటి ఎంతో మంది దర్శకులు తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఈ క్రమంలో ఈ హీరో ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ని మాత్రం చాలా బాధ పెట్టారంట.
మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో వచ్చిన ఒక పెద్ద మలుపు గురించి చెబుతూ అది జరిగింది నాగార్జున వల్లే అంటూ చెప్పుకొచ్చారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘సూపర్’ చిత్రానికి చక్రిని కాకుండా హిందీ మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌటాను.. నాగార్జున ఎంపిక చేశారని చెప్పారు. అప్పటి వరకూ పూరీ సినిమాలకు చక్రినే సంగీతం అందించేవారు. కానీ అప్పుడు నాగార్జున మాట విని పూరి జగన్నాథ్ చక్రిని పక్కన పెట్టారంట. ఆ తర్వాత కొద్ది రోజులు ఆదర్శకుడితో చక్రికి దూరం పెరిగిందంట. మొత్తానికి నాగార్జున నిర్ణయంతో.. పూరీ-చక్రి కాంబినేషన్ అక్కడితో ముగిసిపోయిందన్నది చక్రి వేదన.
How Nagarjuna Effected Chakri Career: చక్రి ఎన్నో హిట్ ఆల్బమ్స్ అందించిన గొప్ప సంగీత దర్శకుడు. ‘ఇడియట్’, ‘శివమణి’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘యువరాజా’ వంటి చిత్రాలకు ఆయన అందించిన సంగీతం ఇప్పటికీ గుర్తుండిపోతుంది. 60కి పైగా చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చిన చక్రి, తెలుగులో తనదైన ముద్ర వేశాడు.
ఒక చిన్న మార్పు వల్ల పెద్ద మార్పు ఎలా జరుగుతుందో ఈ సంఘటన మంచి ఉదాహరణ. ఎందుకంటే ఆ తర్వాత పూరి జగన్నాథ్ సినిమాలకు ఎప్పుడూ కూడా చక్రి పని చేయలేదు. అంతేకాదు అప్పట్లో ఆయనకి ఆఫర్లు కూడా తగ్గాయి. ఇక కొద్ది రోజులకు ఆయన మరణించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతుంది. ఈ సంగీత దర్శకుడు మన మధ్య లేకపోయినా.. ఆయన అందించిన సంగీతం మాత్రం ఎప్పటికీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









