Badmashulu Movie Release: తెలుగు సినీ పరిశ్రమలో తెలంగాణ నేపథ్య చిత్రాలు సక్సెస్ మంత్రంగా కనిపిస్తున్నాయి. బలగం మొదలుకుని మ్యాడ్ 2 దాకా వెండితెరపై మంచి విజయాలు అందుకున్నాయి. ఇదే క్రమంలో మరో సినిమా రాబోతున్నది. హాస్య నేపథ్యంతో 'బద్మాషులు' అనే సినిమా రాబోతున్నది. ఇప్పటికే టీజర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోగా త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ రానుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించారు. జూన్ 6వ తేదీన థియేటర్‌లలో సందడి చేసేందుకు సినిమా సిద్ధమవుతోంది.
Also Read: India Pakistan Ceasefire: భారత్ దెబ్బకు మూడు రోజులకే తోక ముడుచుకున్న పాకిస్థాన్
మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో శంకర్ చేగూరి దర్శకత్వంలో ‘బద్మాషులు’ సినిమా రూపుదిద్దుకుంటోంది. 'తార స్టొరీ టెల్లర్స్' బ్యానర్‌పై బి. బాలకృష్ణ, సీ రామ శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కొన్ని వారాల కిందట విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'బద్మాషులు' చిత్రం జూన్ 6వ తేదీన థియేటర్‌లలో విడుదల కానుంది. దీపా ఆర్ట్స్ ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయనుంది. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ త్వరలోనే విడుదల చేయనున్నారు. ప్రి రిలీజ్ వేడుక కూడా జరుగనుంది.
Also Read: Donald Trump Tweet: డొనల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. ముగిసిన భారత్, పాక్ యుద్ధం
ఇద్దరు స్నేహితులు గ్రామంలో చేసే హంగామా.. వారి జీవితం ఆధారంగా 'బద్మాషులు' చిత్రం ఉన్నట్టు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. మహేశ్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ పాత్రలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ గ్రామీణ నేపథ్యం ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కథ, కథనం హాస్య ప్రధానంగా ఉన్నట్లు కనిపిస్తోంది. 'బద్మాషులు'తో మరోసారి తెలంగాణ సినిమా ప్రేక్షకులకు వినోదం అందించే అవకాశం ఉంది. ఇది మన ఊరి కథ అనే విధంగా ఈ చిత్రంలో పాత్రలు ఉంటాయని చిత్రబృందం వెల్లడించింది. చాలా సహజంగా.. ఒక పల్లెటూరి జీవనాన్ని తెరపై ఆవిష్కరించినట్లు చిత్రవర్గం చెబుతోంది. జనాలను రెండు గంటలు నవ్వించాలి అనే ఉద్దేశంతో బద్మాషులు చిత్రాన్ని శంకర్ చేగూరి తెరకెక్కించారు. మరి జూన్‌లో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.
టీజర్ చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.