)
Traffic Diverted Areas in Hyderabad Today: హైదరాబాద్ లో.. ఈరోజు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం OG Pre release Event కు సిద్ధమైంది. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఈ భారీ వేడుకకు లక్షలాదిగా అభిమానులు హాజరయ్యే అవకాశముందని..నగర ట్రాఫిక్ పోలీసులు కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు. ఈ ఆంక్షలు సెప్టెంబర్ 21న ఉదయం 4 గంటల నుండి రాత్రి 10:30 గంటల వరకు అమలులో ఉంటాయి.
ఈ ఆంక్షల కారణంగా రవీంద్రభారతి, ట్రాఫిక్ పోలీస్ జంక్షన్, బషీర్‌బాగ్, బీజేఆర్ విగ్రహ సర్కిల్, పబ్లిక్ గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో వాహన రాకపోకలు నిలిపివేయబడతాయి లేదా మళ్లింపులు అమలు చేస్తారు. ప్రయాణికులు ఈ మార్గాలను తప్పించాలని.. పోలీసులు సూచించారు.
OG Pre release Event ను ఒక గొప్ప చలనచిత్ర వేడుకగా మార్చేందుకు ఏర్పాట్లు చేపట్టారు. స్టేడియం చుట్టుపక్కల ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. పోలీసులు ప్రజలను సూచనలు పాటించాలని, సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు.
OG చిత్రం చుట్టూ ఏర్పడిన క్రేజ్ రోజురోజుకు పెరుగుతుంది. “హంగ్రీ చిరుత” టీజర్ నుండి కొత్త పోస్టర్లు, థమన్ ఇచ్చిన సంగీతం వరకు అన్నీ.. అభిమానుల్లో మంచి ఆసక్తిని కలిగించాయి. ఈ సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనుండటంతో..అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పోలీసులు ఈవెంట్‌కు హాజరయ్యే అభిమానులు ముందుగానే రావాలని, రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా సిబ్బందితో సహకరించాలని కోరారు. నగరంలో సాధారణ ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.
హైదరాబాద్ నగరం మొత్తం ఈరోజు OG Pre release Event తో ఉత్సాహంగా మారబోతోంది. మరోపక్క ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి.. ఓజి థియేట్రికల్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ మరింత ఉత్సాహాన్ని అందించాయి.
ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రా.. వచ్చిన కళ్ళు చెదిరే రేట్లు షాకిచ్చాయి. కేవలం ఈ రెండు రాష్ట్రాల నుంచే పవన్ కళ్యాణ్ చిత్రానికి ఏకంగా 150 కోట్లకి పైగా బిజినెస్ ని చేసినట్టుగా టాక్. ఇక ఓవర్సీస్ సహా ఇతర భాషలు కలిపి సుమారు 50 కోట్ల లోపు ఉంటుంది అని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook