)
Icon Star Allu Arjun Received A Special Gift: హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో కలిసి ఓ కొత్త సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది. ఇదిలా ఉంటే, ఆర్టిస్ట్ గీత్ గుప్తా అనే అల్లు అర్జున్ లేడీ ఫ్యాన్ తాజాగా ఓ వీడియో షేర్ చేయగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆర్టిస్ట్ గీత్ గుప్తా.. అల్లు అర్జున్, ఆయన కూతురు అల్లు అర్హ పెయింటింగ్స్ వేసి బహుమతిగా ఇచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఆమె కొంత సమయం గడిపారు. ఇక ఆ పెయింటింగ్స్ చూసిన బన్నీ.. చాలా బాగున్నాయని అభినందించారు. ఈ సందర్భంగా తాను వేసిన పెయింటింగ్స్ బహుమతిగా ఇస్తున్న వీడియోను.. గీత్ గుప్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆ వీడియోకి క్యాప్షన్‌గా అల్లు అర్జున్ సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా చాలా మంచి వ్యక్తి అని కొనియాడింది. బన్నీలో దయ, మానవత్వం ఉన్నాయని.. అంత పెద్ద స్టార్ అయినా చాలా సింపుల్‌గా ఉంటారని గీత్ పేర్కొంది. ఆయన చూపించిన ఆప్యాయత, మంచితనం తనకు స్ఫూర్తి అని చెప్పింది. ఈ వీడియోను అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook