Allu Arjun Video: దుబాయ్‌లో అల్లు అర్జున్.. ప్రఖ్యాత హిందూ దేవాలయంలో ప్రత్యేక పూజలు.. వీడియో ఇదిగో..

Allu Arjun in dubai:  అల్లు అర్జున్ దుబాయ్ లో ప్రఖ్యాతి గాంచీన స్వామి నారాయణ్ మందిర్ ను దర్శించుకున్నారు.  పుష్ప2 బ్లాక్ బాస్టర్ హిట్  తర్వాత ఐకాన్ స్టార్ తన ఫ్యామిలీతో చిల్ అవుతున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 23, 2025, 02:44 PM IST
  • దుబాయ్ లో ఐకాన్ స్టార్..
  • ప్రత్యేకంగా పూజలు..
Allu Arjun Video: దుబాయ్‌లో అల్లు అర్జున్.. ప్రఖ్యాత హిందూ దేవాలయంలో ప్రత్యేక పూజలు.. వీడియో ఇదిగో..

Allu Arjun visits baps Swaminarayan mandir in dubai: పుష్ప2 మూవీ ఎంతగా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిందో.. అదే రేంజ్ లో వివాదాల్లో కూడా నిలిచింది. మొత్తంగా ఈ సినిమా సక్సెస్ ను మాత్రం బన్నీ అంతగా ఎంజాయ్ చేయలేదని చాలా మంది తరచుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుంటారు.ఈ నేపథ్యంలో బన్నీ కొన్ని రోజులుగా తరచుగా మళ్లీ వార్తలలో ఉంటున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ అట్లీతో తన తర్వాతి ప్రాజెక్ట్ చేస్తున్నారని.. దీనిలో కూడా అల్లు అర్జున్ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ నడుస్తొంది.

Add Zee News as a Preferred Source

ఇది బన్నీలో కెరీర్ లోనే టాప్ రెమ్యునరేషన్ అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తొంది. దీని గురించి మూవీ టీమ్ అఫిషీయల్ గా తొందరలోనే ప్రకటిస్తారని వార్తలు జోరుగా వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లోని అబుదాబీకి వెళ్లారు. అక్కడ   ప్రఖ్యాత హిందూ దేవాలయం స్వామి నారాయణ్ మందిర్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందర్శించారు. శనివారం (మార్చి 22) ఆలయానికి వెళ్లిన బన్నీ అక్కడి నిర్మాణాలను, శిల్పాలను ఆసక్తిగా గమనించారు.

 

ఈ క్రమంలో ఆలయ ప్రతినిధులు బన్నీకి సాదారంగా వెల్ కమ్ చెప్పారు. ఆలయ విశేషాలను దగ్గరుండి చెప్పారు. అనంతరం స్వామి నారాయణ్ ఆలయంలో బన్నీ ప్రత్యేకంగా పూజలు చేశాడు. బన్నీకి పండితులు స్వామివారి ప్రసాదం, ఆశీర్వాచనం ఇచ్చారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ప్రస్తుతం దుబాయ్ లో స్వామి నారాయణ్ ఆలయంను సందర్శించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు పుష్పరాజ్ .. కొన్నిరోజులుగా ఇంటికే పరిమితం అయ్యారు.

Read more: Rashmika Mandanna Video: విజయ్ కాదు.. ఆ కెమెరా మెన్ తో ప్రేమలో రష్మిక..?.. ఏకంగా నా మనసు గెలిచావంటూ..!.. వీడియో వైరల్..  

పుష్ప2 రిలీజ్ వేళ జరిగిన ఘటనతో ఆయన చాలా డిస్టర్బ్ అయ్యారని, అల్లు అరవింద్ చెప్పారు. లేకుంటే.. బన్నీ ఏమాత్రం గ్యాప్ దొరికిన తన భార్యతో కలిసి సమ్మర్ వెకెషన్ కు కొత్త ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇక బన్నీ ప్రస్తుతం నార్మల్ కావడంతో పాటు.. ఆస్పత్రిలో ఉన్న శ్రీతేజ్ తొందరగా కొలుకొవాలని బన్నీ ఫ్యాన్స్ కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నారు.  బన్నీ టీమ్ సైతం.. శ్రీతేజ్ హెల్త్ కోసం తాము అన్నివిధాలుగా ముందుంటామని ఇప్పటికే ప్రకటించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News