Shashtipurthy Teaser: ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఇళయరాజా కూడా పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఓ పాటకు ఆయన లిరిక్స్ కూడా అందించాడు. అయితే సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమా ఆర్కే సినీ మాక్స్‌లో దర్శకుడు ఇళయరాజా చేతులమీదుగా టీజర్ విడుదలైంది.
ఇక ఈ టీజర్ విడుదల సమయంలో కీరవాణి మాట్లాడుతూ.. సినిమాలో రాజా సార్ ట్యూన్ కి రావలసిన పల్లవి 'ఏదో ఏ జన్మలో ఈ పరిచయం.. అనే పాట రాశాను అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కథకి పాత్రలకి తగ్గట్టుగా పాట రాయడం జరుగుతుంది. ఈ పాట నా జీవితాన్ని కూడా సంబంధించింది అన్నారు అంతే కాదు కీరవాణి గారు తాను కేవీ మహదేవన్ వీరాభిమానినని చెప్పుకొచ్చారు దీంతో పాటు ఆయన ఇళయరాజా సంగీతానికి అభిమానినిగా యుగంధర్ సినిమా నుంచి మారానన్నారు .
చక్రవర్తి గారి దగ్గర పని చేసినప్పుడు ఇళయరాజా వారిని కలిసి అవకాశం దొరికింది. అయితే ఇళయరాజా గారి సంగీతానికి తాను పాడాలని అనుకున్నాను. ఆ అవకాశం రాలేదు కానీ ఆయన సంగీతానికి పాట రాసే అవకాశం దొరికింది. ఆయన పక్కనే కూర్చొని సినిమాకు నేను పాట రాశాను. అది మాత్రమే కాకుండా ఈ అవకాశం ఇప్పించిన రూపేష్, పవన్ గారికి కూడా కృతజ్ఞతలు అన్నారు.
ఇక ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ప్రేమించు పెళ్లాడు అని మొదటి సినిమాకి సంగీతాన్ని ఆయన అందించారు. ఆ తర్వాత లేడీస్ టైలర్ ప్రాణం పోసింది. అయితే అంతకుముందు నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను ఇళయరాజా సంగీతం వల్ల ఈ సినిమా హిట్ అయింది అని చెప్పుకొచ్చారు. అయితే అప్పట్లో షూటింగ్ సమయంలో ఇళయరాజా నన్ను రా.. అని పిలిచారు చాలా బాగా నటించావు అన్నారు. అలాంటి మా స్వామి మళ్లీ ఇంత కాలానికి కలిసాను. నా సినిమాకి సంగీతాన్ని అందించడం చాలా సంతోషం అన్నారు.
కీరవాణి గారు ఈ సినిమాకి పాట రాశారంటే ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు అని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తన జీవితంలో షష్టిపూర్తి చేసుకోలేదు కానీ నట జీవితంలో షష్టిపూర్తి వచ్చింది. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది. అద్భుతమైన పాత్ర చేశాను తెలుగు సినిమాకి కావాల్సిన అన్ని విలువలు ఉన్న చిత్రమిది అని రాజేంద్రప్రసాద్ అన్నారు.
ఇదీ చదవండి: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఈ లింక్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి..
ఇక సంగీత దర్శకుడు ఇళయరాజా మాట్లాడుతూ.. ఈ ఏజ్ లో కూడా ఇలా సంగీతం చేస్తున్నారని అంటున్నాడు రాజేంద్రప్రసాద్ సంగీతం ఈ ఏజ్ లో చేయకూడదా? వీడు మా వాడే. వీడు వంశీ ఇలా ఒక గ్రూప్ ఉంది. కంపోజింగ్ ముందు గలాటా చేసేవారు. ఈ సినిమాకి నేను చేస్తున్న సంగీతం మీరు వినబోతున్నారు. కీరవాణి రాసిన పాట విన్నప్పుడు నా మీద ఉన్న ఆత్మబంధాన్ని రాశారని నాకు అర్థం అయింది అన్నాడు ఇళయరాజా. అయితే, మీ వేలాది పాటలో ఏ పాట మీకు నచ్చింది అంటే.. ఆయన నాకు ఏ పాట ఇష్టం కాదు సంగీతమే నాకు తెలుసు కానీ ఆ సంగీతం ఎలా వస్తుందో తెలియదు.. అది తెలిస్తే మరుక్షణం నేను ఈ సంగీతాన్ని ఆపేస్తాను అన్నారు. ఈ సినిమాలో నటి చేస్తున్న కొత్త వారిని ప్రోత్సహించడానికి నేను ఇక్కడికి వచ్చాను అన్నారు.
ఇదీ చదవండి: తిరుమలలో వేసవి రద్దీ వేళ.. వీఐపీ సిఫార్సు లేఖల తిరస్కరణ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









