International Childrens Drama Festival: ప్రతిభకు వయసుతో సంబంధంలో లేదంటారు. కానీ చిన్న వయసులోనే టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహిస్తే.. ఆ చిన్నారులు భవిష్యత్‌లో అద్భుతాలు సృష్టిస్తారు. ఇలా నాటకరంగంలో బాలబాలికల ప్రతిభను పెంపొందించేందుకు ప్రముఖ నటనా శిక్షణ సంస్థ నిశుంబితా స్కూల్ ఆఫ్ డ్రామా రెడీ అయింది. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ బాలల నాటక ఉత్సవాన్ని గ్రాండ్‌గా నిర్వహించనుంది. మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ జరుగుతుండడం విశేషం. ముఖ్య అతిథులుగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, ప్రముఖ నటుడు అనీష్ కురువిల్ల, సినీ దర్శకులు వినయ్ వర్మ, వెంకట్ గౌడ, రచయిత ఆకెళ్ళ శివ ప్రసాద్ విచ్చేయనున్నారు.
ఈ వేడుకలో కోల్‌కతా, భోపాల్, కేరళ రాష్ట్రాల నుంచే కాకుండా.. నేపాల్, జపాన్ తదితర దేశాల్లోని కళాకారులు, నాటక బృందాలు కూడా పాల్గొనున్నాయి. ఈ నెల నుంచి 9వ తేదీ వరకు రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరగనుంది. థియేటర్, స్టోరీ టెల్లింగ్, నాటక ప్రదర్శనలతో చిన్నారులను అలరించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు రెడీ అయ్యారు. కొత్త తరం కళాకారుల్లో సృజనాత్మకత, సాంస్కృతిక విలువలను పెంపొందిచేలా ఈ వేడుకలో నాటకాలు ప్రదర్శించనున్నారు.
ఈ సందర్భంగా నిర్వాహక బృందం ప్రతినిధి దేవికాదాస్ మాట్లాడుతూ.. స్వీయ వ్యక్తీకరణ, ఆత్మవిశ్వాసం పెంపొందించడం, కళలపై పట్టు సాధించడానికి నాటక రంగం ఓ శక్తివంతమైన సాధనమని అన్నారు. విభిన్న సంస్కృతుల కళాకారులను ఓ వేదికపై చేరుస్తూ.. కొత్త తరం నాటక ప్రేమికులను ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో రంగస్థలంపై చిన్నారులు చేసే మ్యాజికల్ పర్ఫామెన్స్ చూసేందుకు చక్కటి అవకాశం అని అన్నారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. నేటి తరానికి రంగస్థల ఆవశ్యకతను గుర్తుచేసేందుకు ఈ ప్రోగ్రామ్ అన్నివిధాల అనువైన సారథిగా నిలుస్తుందన్నారు.
Also Read: AP Aqua Industry: 'డొనల్డ్ ట్రంప్ దెబ్బకు అల్లాడుతున్నాం.. కాపాడండి': సీఎం చంద్రబాబు లేఖ
Also Read: Telangana Inter Results 2025: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడు ఎక్కడ చెక్ చేసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









