Retro Director About Game Changer: రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమా ఎలాంటి అపజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ హీరోగా.. పాన్ ఇండియా దర్శకుడు శంకర్ సినిమా తీస్తారు అనగానే.. అందరిలోనూ ఆసక్తి పెరిగింది. కానీ విడుదలైన తరువాత ఈ చిత్రాన్ని చూసి మెగా పవర్ స్టార్ అభిమానుల సైతం నిరాశ చెందారు.
ఈ క్రమంలో తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్..ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఈ సినిమాకు తానే కథను అందించినట్టు తెలియజేసిన ఆయన..తాను ఇచ్చిన స్టోరీ స్క్రీన్‌ప్లేలో అనేక మార్పులు జరిగాయని..చివరకు సినిమా పూర్తిగా భిన్నంగా తయారైందని వెల్లడించారు.
గలాటా ప్లస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ మాట్లాడుతూ.. తాను స్టోరీ యొక్క వన్ లైనర్‌ను దర్శకుడు శంకర్‌కు వివరించినట్టు చెప్పారు. "ఒక ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకుడిగా..మారే కథను నేను రాసుకున్నాను. అయితే ఆ తర్వాత పలువురు రచయితలు వచ్చి స్క్రీన్‌ప్లేను పూర్తిగా మార్చేశారు. ఇది నా ఊహలకు విరుద్ధంగా మరోదారి పట్టింది," అని ఆయన తెలిపారు.
అలానే, సినిమాకు అనేక మంది రచయితలు పని చేయడంతో అసలు కథకు దూరమైనట్లు చెప్పారు. స్క్రీన్‌ప్లే, కథ రెండూ అనేక మార్పులకు గురయ్యాయని పేర్కొన్నారు. అయితే, చివరికి ప్రేక్షకుల అభిరుచి కీలకమని..వాళ్లకు ఏది నచ్చుతుందో చెప్పడం కష్టం అని పేర్కొన్నారు.
గేమ్ ఛేంజర్ చిత్రాన్ని చూసిన అనంతరం కార్తీక్ సుబ్బరాజ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఇది గ్రాండ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని, శంకర్ స్టైల్ స్పష్టంగా కనిపించిందని ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడేమో ఈ చిత్రం డిజాస్టర్ అయిన తరువాత ఈ మాటలు అనేయడంతో.. మొత్తానికి ఈ దర్శకుడు గేమ్ చేంజెర్ ఫ్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం శంకర్ అని క్లారిటీ ఇచ్చినట్టు అందరూ భావిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా, త్వరలో జీ తెలుగులో టీవీ ప్రీమియర్‌కి రానుంది. అయితే ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ అయినప్పటి నుంచి కూడా ఈ సినిమాపై నెగిటివ్ స్పందనే వస్తోంది. అసలు శంకర్ ఇంకా కూడా పాత చిత్రాల లానే తీస్తున్నారని.. ఇప్పటి తరానికి అప్గ్రేడ్ అవ్వలేదు అని కామెంట్లు వినిపిస్తున్న సమయంలో.. కార్తీక్ సుబ్బరాజు చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుతం మరింత చర్చనీయాంశంగా మారాయి.
ఇదీ చదవండి: శరీరానికి ఉత్సాహాన్నిచ్చే శక్తివంతమైన పండు.. గుండె నుంచి మెదడు వరకు ఎంతో మేలు..
ఇదీ చదవండి: రాత్రంతా ఏసీ వేసుకుని పడుకుంటున్నారా? మీ శరీరంలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









