Vijay Deverakonda: విజయ్ దేవరకొండ అనవసరంగా ఆ ఇండస్ట్రీ తో వివాదం పెట్టుకున్నారా..?

Vijay Deverakonda About Bollywood : హిందీలో ఇప్పటివరకు పెద్దగా విజయం అందుకోకపోయినా.. అక్కడ వారిలో విజయ్ దేవరకొండ కి చాలా క్రేజ్ ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్లో సైతం విజయ్ దేవరకొండ కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో భారీ వచ్చిన మాల గురించి విజయ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

Written by - Vishnupriya | Last Updated : Apr 4, 2025, 02:45 PM IST
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ అనవసరంగా ఆ ఇండస్ట్రీ తో వివాదం పెట్టుకున్నారా..?

Vijay Deverakonda About Bollywood Future: సూపర్ హిట్ చిత్రాలు అర్జున్ రెడ్డి, గీత గోవిందంతో స్టార్‌డమ్ అందుకున్న విజయ్ దేవరకొండ.. ఇటీవల వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. దీంతో అతని తాజా సినిమా కింగ్‌డమ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. భాజ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మే 30న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా విడుదల కాబోతోంది.

Add Zee News as a Preferred Source

ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ప్రస్తుతం దక్షిణాది సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోందని, ఇక్కడి సినిమాలకు ఆదరణ పెరిగిందని వెల్లడించాడు. ఒకప్పుడు ఈ చిత్రాలను పట్టించుకోని బాలీవుడ్ ఇప్పుడు ఆ గుర్తింపు కోసం కష్టపడుతోందని తెలిపాడు. ఇదంతా కాలచక్రంలాంటిదని, రానున్న రోజుల్లో పరిస్థితులు మారవచ్చని అభిప్రాయపడ్డాడు.

బాలీవుడ్ ప్రస్తుతం సృజనాత్మకత లోటుతో బాధపడుతోందని విజయ్ అభిప్రాయపడ్డాడు. ఈ లోటును పూరించేందుకు కొత్త దర్శకులు, సాంకేతిక నిపుణులు అవసరమని చెప్పారు. ముంబై నుంచి కాకుండా వేరే దగ్గర నుంచి వచ్చే దర్శకులను బాలీవుడ్ స్వీకరించినప్పుడు.. అక్కడ తప్పకుండా బ్లాక్ బస్టర్ సినిమాలు మొదలవుతాయి అని చెప్పుకొచ్చారు. మంచి ప్రతిభ ఉన్న దర్శకులకు అవకాశాలు కల్పిస్తే హిందీ సినిమా పరిశ్రమ మళ్ళీ పురోగతిని సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఈ హీరో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ వారి గురించి విజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇలాంటి సందర్భంలో విజయ్ ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండు అనేది ఎంతోమంది అభిప్రాయం. ఈ మాటలు కాంట్రవర్సీగా మారితే.. విజయ్ కి లేనిపోని తలనొప్పి రావచ్చు అని కొంతమంది భావిస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం విజయ్ చేసిన వ్యాఖ్యలలో ఎటువంటి తప్పు లేదు అని సమర్థిస్తున్నారు.

తెలుగు సినిమా అంతర్జాతీయ గుర్తింపునకు బాహుబలి కీలకమైందని విజయ్ పేర్కొన్నారు. ఈ చిత్రం ఫెయిలయ్యుంటే ఎంతో మంది కెరీర్‌లు సంక్షోభంలో పడేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నో త్యాగాలు చేసి, ఐదేళ్లు కష్టపడి ఈ సినిమాను తీసిన టీమ్, సినిమా విజయం ద్వారా పరిశ్రమ స్థాయిని మార్చేసిందని కొనియాడారు.

Vijay Deverakonda movies: కాగా ఈ మధ్యనే లైగర్ ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలతో ఘోర పరాజ్యాలను చవిచూశారు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతో నష్టం మిగిల్చాయి. అయినా కానీ ఈ హీరోకి అవకాశాలు మాత్రం తగ్గలేదు. విజయ్ ప్రస్తుతం కింగ్‌డమ్ సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నాడు. ప్రచార చిత్రాలు, అభిమానుల స్పందన చూస్తే ఈసారి విజయం అందుకోవడం ఖాయమనే భావన ఉంది. వరుస పరాజయాల తర్వాత ఈ సినిమా విజయవంతమైతే విజయ్ దేవరకొండ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News