Jaat Trailer Talk Review: సన్ని దేవోల్ ‘జాట్’ మూవీ ట్రైలర్ టాక్ రివ్యూ.. ఇదేం మాస్ ఊచకోతర మామ..

Jaat Trailer Talk Review: సన్ని దేవోల్ బాలీవుడ్ లో మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. గత కొన్నేళ్లుగా హీరోగా వెనకబడ్డ సన్నిదేవోల్.. రెండేళ్ల క్రితం విడుదలైన ‘గదర్ 2’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. తాజాగా ఈయన తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘జాట్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 24, 2025, 04:00 PM IST
Jaat Trailer Talk Review: సన్ని దేవోల్ ‘జాట్’ మూవీ ట్రైలర్ టాక్ రివ్యూ..  ఇదేం  మాస్ ఊచకోతర మామ..

Jaat Trailer Talk Review: బాలీవుడ్ లో ఖాన్ త్రయం ప్రవేశించ వరకు చాలా యేళ్ల వరకు సన్ని దేవోల్ నెంబర్ బాలీవుడ్ హీరోగా సత్తా చాటాడు. అంతేకాదు ఈయన కెరీర్ లో పలు ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఉన్నాయి. తాజాగా ఈయన ‘గదర్ 2’ వంటి ఇండస్ట్రీ  బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఈయన హీరోగా నటించిన చిత్రం ‘జాట్’. తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెలుగు నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా సంయుక్త నిర్మాణంలో  తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్, ప్యాక్డ్  మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉంది.

Add Zee News as a Preferred Source

ఈ సినిమా ట్రైలర్ లో ముందుగా ఓ రైతు నాగలి దున్నుతుంటే.. అందులోంచి శవాల గుట్టలు బయట పడతాయి. దాన్ని కారకులు ఎవరు. లంకలో ఉండే ఓ దుర్మార్గుడు ఊరి ప్రజలను హింసిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఈ ఊరి ప్రజలను కాపాడానికి వచ్చిన  పోలీస్ ఆఫీసర్ .. ఆ దుర్మార్గుల అంతం ఎలా చేసాడనేది ఈ సినిమా స్టోరీగా కనిపిస్తోంది.

దర్శకుడిగా గోపీచంద్ మలినేని ఇప్పటి వరకు తెలుగులో మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఇక బాలయ్యతో ‘వీరసింహారెడ్డి’ సినిమా తర్వాత సన్ని దేవోల్ తో పూర్తి స్థాయి మాస్ యాక్షన్ సినిమాగా తీర్చిదిద్దాడు. అంతేకాదు మాస్ సినిమాల కోసం ఎదురు చూస్తోన్న ప్రేక్షకులు ఈ సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పాలి. ఈ సినిమాను ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మొత్తంగా ‘గదర్ 2’ వంటి బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తోన్న ‘జాట్’ మూవీతో సని దేవోల్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తాడా లేదా అనేది చూడాలి.

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News