Jack Review:‘జాక్’ మూవీ రివ్యూ.. సిద్దు జొన్నలగడ్డ కామెడీ ధ్రిల్లర్ ఎలా ఉందంటే..

Jack Review: ‘టీజే టిల్లు’, టిల్లు స్క్వేర్ మూవీలతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీల ఊర మాస్ యంగ్ హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హైదరాబాదీ యాసలో సిద్దు పలికే డైలాగులకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇపుడు టిల్లు సిరీస్ లో కాకుండా తొలిసారి ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్’ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 10, 2025, 01:05 PM IST
Jack Review:‘జాక్’ మూవీ రివ్యూ.. సిద్దు జొన్నలగడ్డ కామెడీ ధ్రిల్లర్ ఎలా ఉందంటే..

మూవీ రివ్యూ: జాక్  (Jack)
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య, ప్రకాష్ రాజ్, నరేష్, సుబ్బరాజు,  బ్రహ్మాజీ తదితరులు
సంగీతం: అచు రాజమణి, సామ్ సీఎస్, సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: విజయ్ కే చక్రవర్తి
ఎడిటర్: : నవీన్ నూలి
నిర్మాత: బీవీయస్ఎన్ ప్రసాద్
దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్  
విడుదల తేది: 10-4-2025

Add Zee News as a Preferred Source

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ అనే కంటే టిల్లుగాడిగా తెలుగు ప్రేక్షకులకు తన నటనతో ఆటిట్యూడ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇపుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్’ వంటి స్పై కామెడీ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది. సిద్దు ఆడియన్స్ ను అలరించాడా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

పాబ్లో నెరుడా జాక్ అలియాస్  (సిద్దు జొన్నలగడ్డ) ఏ పని సరిగా పూర్తి చేయకుండా అన్నింట్లో మధ్యలో విడిచిపెట్టే టైపు. తన కుమారుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి ప్రసాద్ (సీనియర్ నరేష్ ) ఓ డిటెక్టివ్ ఏజెన్సీని ఆశ్రయిస్తాడు. ఆ డిటెక్టివ్ ఓనర్ కూతురు అఫ్జానా తన టీమ్ కలిసి జాక్ ఏం చేస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో జాక్ ఎవరు ? అల్లరి చిల్లరిగా తిరిగే జాక్ కు  ‘రా’ సంస్థకు  ఉన్న సంబంధం ఏమిటి ? మరి దేశాన్ని నాశనం చేయాలనుకున్న దుష్టశక్తులను జాక్ ఎలా కట్టించాడు. ఈ క్రమంలో ఏం జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్.. లవ్ అండ్ సెన్సిబుల్ సినిమాలకు చిరునామ. మధ్యలో పరుగు, ఒంగోలు గిత్త  వంటి మాస్ సినిమాలతో అలరించే ప్రయత్నం చేసాడు. తాజాగా ఇపుడు ‘జాక్’ అంటూ కామెడీ స్పై థ్రిల్లర్ తరహా కథను రాసుకున్నాడు. అంతా బాగానే ఉన్నా.. దాన్ని ఇంకాస్త బెటర్ తెరకెక్కించి  ఉంటే  సినిమా నెక్ట్స్ లెవల్లో ఉండేది.  ముఖ్యంగా హీరో పాత్ర..జాక్ ఆఫ్ ఆల్.. మాస్టర్ ఆఫ్ నన్ అనే తరహాలో అన్ని అంశాలపై అవగాహన ఉంటుంది కానీ.. ఎందులో మాస్టర్ కాడు. అదే కాన్సెస్ట్ తో హీరో పాత్రను రాసుకున్నాడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. ముఖ్యంగా  ‘గూఢచారి’ కావాలనుకునే ఓ వ్యక్తి ఏదో కాలేజిలో ప్రాక్టికల్స్ చేసినట్టు క్రిమినల్స్ చేసే పనులను అబ్జర్వ్ చేస్తూ ఓ థియరీ రెడీ చేసుకుంటాడు. ఈ సందర్బ:గా  ‘రా’ ఏజెంట్ కు జరిగే ఇంటర్వ్యూలో తన థియరీకి సంబంధించిన విషయాలను వివరించడం కాస్త సిల్లీగా అనిపిస్తోంది.

ముఖ్యంగా ‘రా’ గూఢచారి నేపథ్యంలో తెరకెక్కే సినిమాలు ఎలా ఉంటాయో.. గతంలో హిందీలో వచ్చిన ‘బేబి’ ‘బెల్ బాటమ్’ వంటి సినిమాలను చూసి దర్శకుడు కాస్తంత అవగాహన పెంచుకుంటే బాగుండేది. మన తెలుగు దర్శకులు ప్యాన్ ఇండియా లెవల్లో అద్భుతమైన సినిమాలు చేసినా.. ‘రా’ వంటి సీక్రెట్ ఏజెంట్ సినిమాలు ఎలా తెరకెక్కించాలో బాలీవుడ్ లేదా తమిళ దర్శకులను చూసి చూసి నేర్చుకోవాల్సిందే. బొమ్మరిల్లు భాస్కర్ లాజిక్ ను పక్కన పెట్టి పూర్తిగా సిద్దు ఇమేజ్ పైనే ‘జాక్’ సినిమా మొత్తాన్ని లాక్కొచ్చాడు.

ముఖ్యంగా ‘రా’ ఏజెంట్ కావాలనుకునే ‘జాక్’... ఓ టెర్రిరిస్ట్ ను పట్టుకోవడం వరకు ఓకే కానీ.... ‘రా’ కు సంబంధించిన ముఖ్య అధికారిని కిడ్నాప్ చేయడం వింతల్లో కెల్ల వింతగా ఉంటుంది. హీరో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాబట్టి అతనికి టెక్నికల్ కు సంబంధించి హ్యాకింగ్ సహా పలు అంశాలపై అవగాహన ఉండే అవకాశం ఉంది. అదే హీరో ఎవరి ఫోన్స్ సహా వాళ్లకు సంబంధించిన అంశాలపై నిఘా పెట్టడానికి ఆస్కారం ఏర్పడింది.  ముఖ్యంగా హీరోను కామెడీగా చూపిస్తూనే సిద్దులోని మాస్ ఇమేజ్ ను మరింత ఎలివేట్ చేసే ప్రయత్నం చేసాడు దర్శకుడు. ఇందులో లాజిక్ కు అందని మరో విషయం.. రా ఏజెంట్ ఎవరనేది కనుక్కోవడం అంత ఈజీకాదు. ఇక  దేశాన్ని కాపాడంలో ముందుండే‘రా’ ఏజెంట్స్ ను చంపడానికి  దేశంలోని వివిధ ప్రదేశాల్లో స్నైపర్స్ ను మోహరిస్తాడు  ఉగ్రవాదులకు చెందిన అగ్ర నేత. హీరో చివర్లో దేశంలోని వివిధ ‘రా’ ఏజెంట్స్ తో పాటు ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన ‘రా’ ఏజెంట్స్ ను హీరో జాక్ కాపాడటం సిల్లీగా ఉంటుంది. లాజిక్స్ కు పక్కన పెడితే.. క్లైమాక్స్ లో హీరో దేశాన్ని కాపాడాలి. అలా లేకపోతే మన ఆడియన్స్ ఒప్పుకోరు. అదే ఈ సినిమా క్లైమాక్స్ లో రాసుకున్నాడు. అందులో దర్శకుడిని తప్పు పట్టాల్సిన పనిలేదు.  ఆ లాజిక్స్ ను పక్కన పెడితే.. సినిమా మొత్తాన్ని తన యాక్టింగ్ సిద్దు నెట్టుకొచ్చేసాడు. ఇక మధ్యలో  హీరోయిన్ హీరో స్థావరాన్ని కనుగొనడం వంటివి లాజిక్ కు అందవు.  ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ఆర్ బాగుంది. రెండు పాటలు వినసొంపుగా ఉన్నాయి. మొత్తంగా లాజిక్ ను పక్కన పెడితే..కొన్ని సీన్స్ ఆడియన్స్ ను మెప్పిస్తాయి. మొత్తంగా సొద్దు ఇమేజ్ ను  దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ సినిమా  ఓ వర్గం ప్రేక్షకుల కోసం తెరకెక్కించినట్టు ఉంది.

నటీనటుల విషయానికొస్తే..
సిద్దు జొన్నలగడ్డ మరోసారి జాక్ పాత్రలో తనదైన యాక్టింగ్ తో మెప్పించాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడు. వైష్ణవి చైతన్య కూడా క్యూట్ క్యూట్ లుక్స్ తో గ్లామర్ తో అలరించింది. హైదరాబాదీ అఫ్లానా అలియాస్ భానుమతి పాత్రలో మెప్పించింది. ప్రకాష్ రాజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.  ‘రా’ ముఖ్య అధికారి పాత్రలో మెప్పించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

పంచ్ లైన్ .. ‘జాక్’.. నో లాజిక్.. ఓన్లీ సిద్దు మ్యాజిక్..

రేటింగ్: 2.75/5

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News