Telugu Dancers Union: లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై మరో వార్త షికరు చేస్తోంది. కొరియోగ్రాఫర్ల సంఘం నుంచి శాశ్వతంగా తొలగించారనే వార్తలు వైరల్‌గా మారాయి. దీంతో సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ఈ వార్త తన దృష్టికి రావడంతో వెంటనే జానీ మాస్టర్‌ స్పందించారు. అసత్య వార్తలు షికారు చేయడంతో వీడియో రూపంలో వివరణ ఇచ్చారు. తనను ఎవరూ ఏ సంఘం నుంచి తొలగించలేదని ప్రకటించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Pan India No.1 Hero: ప్రభాస్ వర్సెస్ అల్లు అర్జున్.. పాన్ ఇండియా నంబర్ వన్ హీరో ఎవరు..?


 


'ఉదయం నుంచి నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. నన్ను డ్యాన్సర్ల సంఘం నుంచి శాశ్వతంగా తొలగించారని జరుగుతున్న ప్రచారం తప్పు. వాటిని ఎవరూ నమ్మొద్దు. నన్ను ఏ యూనియన్‌ నుంచి ఎవరూ తీసేయలేదు. నా కార్డు ఎవరూ తొలగించలేదు. నేను డ్యాన్సర్‌ సంఘంలో సభ్యుడిని. నిన్న జరిగిన ఎన్నికలపై న్యాయ పోరాటం చేస్తున్నా. ఆ వివరాలు త్వరలో చెబుతా' అని జానీ మాస్టర్‌ ప్రకటించారు.

Also Read: Fateh Teaser Review: సైబర్ నేరాలపై సోనూ సూద్ ఎక్కు పెట్టిన అస్త్రం ‘ఫతే’.. ఆకట్టుకుంటున్న టీజర్..


కొన్ని కొన్ని ఛానల్స్‌ మాత్రమే అవతలి వారి మనసులు బాధపెట్టేలాగా.. తెలుసుకోకుండా వార్తలు ఉన్నదీ లేనిది ప్రసారం చేస్తున్నారు. వాస్తవం తెలుసుకుని ప్రసారం చేయండి. ఎందుకంటే దానివలన అవతలి వారి మనసులు బాధపడతారు. శాశ్వతంగా నన్నే కాదు.. ఎవరినీ శాశ్వతంగా తీయలేరు. ఎందుకంటే పనిని.. ప్రతిభను ఎవరూ ఆపే హక్కు లేదు. త్వరలోనే మంచి పాటతో వస్తున్నా' అని జానీ మాస్టర్‌ ప్రకటించారు.


'నేను డ్యాన్స్‌ రిహార్సల్స్‌లో ఉన్నా. నేను.. నా టీమ్‌ రిహర్సల్స్‌ చేస్తోంది. మంచి పాటలతో మీ ముందుకు వస్తున్నా. అసత్య వార్తలు నమ్మవద్దు. నన్ను ఏ యూనియన్‌ తొలగించలేదు. నేను ప్రతి యూనియన్‌లో పని చేయవచ్చు. నేను ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చా. మోయిన్‌, యానీ, శిరీశ్‌, భాను మాస్టర్లను కొరియోగ్రాఫర్లుగా చేశా. మరికొందరు అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్లు త్వరలోనే ముందుకు వస్తారు. ప్రతిభను ఎవరూ తొక్కలేరు' అని జానీ మాస్టర్‌ స్పష్టం చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.