Jatadhara review: ‘జటాధర’ మూవీ రివ్యూ.. సుధీర్ బాబు ఖాతాలో హిట్ పడినట్టేనా..!

Jatadhara review: సుధీర్ బాబు గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. ఈ నేపథ్యంలో వెంకట కళ్యాణ్ దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మించిన చిత్రం ‘జటాధర’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..   

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 7, 2025, 01:22 PM IST
Jatadhara review: ‘జటాధర’ మూవీ రివ్యూ.. సుధీర్ బాబు ఖాతాలో హిట్ పడినట్టేనా..!

ఈ మధ్యకాలంలో కమర్షియల్ హార్రర్ చిత్రాలకు డేవోషనల్ టచ్ ఇస్తు తెరకెక్కిన  చిత్రాలు మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు ‘జటాధర’ టైటిల్ తో హార్రర్ మూవీకు డేవోషనల్ టచ్ చేస్తూ చేసిన చిత్రం ‘జటాధర’. ఈ రోజు రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో మన రివ్యూలో చూద్దాం.. 

Add Zee News as a Preferred Source

కథ విషయానికొస్తే.. 

శివ (సుధీర్ బాబు) దెయ్యాలు, భూతాలు లేవని  ప్రూవ్ చేయడమే ధ్యేయంగా బతుకుంటాడు.  అసలు దెయ్యాలు భూతాలు అనేవి ఏమి లేవు. మన భయమే పెద్ద దెయ్యం అని చెబుతుంటాడు. ఈ క్రమంలో పాడుపడ్డ భవనాల్లో తన స్నేహితులతో కలిసి  దెయ్యాలు ఉన్నాయా లేవా అని కనుక్కునే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో శివకు తరుచుగా ఓ పీడ కలలో వెంటాడుతూ ఉంటుంది.  ఆ కలలో చిన్న శిశువును చంపడానికి అతని తల్లితో పాటు తండ్రి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అదే ఊర్లో రుద్రారం గ్రామంలో వాళ్ల పూర్వీకులు బందిపోటు దొంగల నుండి తమ ధనాన్ని కాపాడుకోవాడినికి ఓ చోట బిందెల్లో ధనాన్ని పాతిపెట్టి.. బందిపోటుల బారిన పడకుండా దానికి కాపలాగా ధన పిశాచిని ఆవాహాన చేసి అక్కడ పెడుతారు. దీంతో ఆ ధన పిశాచి అక్కడే ఉంటుంది.  కొన్నేళ్లు తర్వాత ధనాన్ని దాచిపెట్టిన వాళ్ల వారసులు..  తమ ఇంట్లో అనంతమైన ధనం ఉందని తెలుసుకొని .. ఆ ధనాన్ని పొందడానికి క్షుద్ర పూజలు నిర్వహిస్తారు.ఈ క్రమంలో ఓ శిశువును బలి కోరుతుంది ధన పిశాచి. మరి ధన పిశాచి కోరినట్టు వాళ్లు శిశువు బలి ఇచ్చారా..? చివవరకు వాళ్లు ఏమయ్యారు.. ?    మరోవైపు  ఆ ఇంట్లో తిష్ఠవేసుకుని కూర్చోన్న ధన పిశాచి.. శివను చంపాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతకీ శివను ధన పిశాచి ఎందుకు చంపాలనుకుంటుంది. అతనికి ఆ ఇంట్లో వాళ్లకు ఉన్న సంబంధం ఏమిటి.. ? కలలో ఓ చిన్న పిల్లాడిని చంపాలనుకున్న భార్య భర్తలు ఎవరు.. ? అతనికి శివకు ఉన్న సంబంధం ఏమిటి.. ?  ఇక దెయ్యాలు ఉన్నాయా లేవా అని రీసెర్చిలో శివకు ఎదురైన అనుభవాలు ఏమిటి..? శివను చంపాలనుకున్న  ధన పిశాచి పీడ విరుగుడైందా లేదా అనేదే ‘జటాధర’ మూవీ స్టోరీ.  

కథనం, టెక్నికల్ విషయానికొస్తే.. 

గత కొన్నేళ్లుగా కమర్షియల్ చిత్రాలకు డేవోషనల్ టచ్ ఇస్తూ తెరకెక్కించిన ‘అఖండ’, కార్తికేయ, కార్తికేయ 2 వంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకట్ కళ్యాణ్..అదే తరహా కథను ఎంచుకున్నాడు. ఓ ఊరు .. ఆ ఊరిపై పడి దోచుకునే బందిపోటు దొంగలు.. వారి బారి నుంచి తమ ధనాన్ని రక్షించుకోవడానికి అక్కడి ప్రజలు లంకె బిందెల్లో సొమ్మును భూముల్లో దాచి పెడతారు. దాన్ని కూడా వాళ్లు తస్కరిస్తూ ఉండటంతో ఇక లాభం లేదనుకొని కొంత మంది మాంత్రికులతో కలిసి ఆ లంకె బిందులకు ధన పిశాచిని ఆవాహాన చేసి కాపాలగా ఉంచుతారు. అది తిరగబడి ఆ ఊరి ప్రజలను చంపడం వంటివి కాన్సెప్ట్ బాగుంది. కట్ చేస్తే ఆ లంకె బిందెలు కలిగిన ఇంటి వారసులు కొన్ని తరాల తర్వాత దాన్ని పొందడానికి క్షుద్ర పూజలు చేయడం.. దీంతో ధన పిశాచి వచ్చి అందరిని చంపేయడం వంటివి పాత సినిమాల్లో చూసిందే. అయితే దర్శకుడు చెప్పాలనుకున్న కథ బాగున్నా.. దాన్ని తెరకెక్కించే విధానంలో అక్కడక్కడ తడబడ్డాడు. మరోవైపు హీరో దెయ్యాలు ఉన్నాయా లేవా అని వేరే పని పాటా లేదన్నట్టు చూపించడం అంత  కన్విన్సింగ్ గా ఉండదు. 

ఇక ధన పిశాచి .. హీరోను చంపాలనే ప్రయత్నం చేస్తుండటం.. దాని వెనక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ పెట్టారు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన దివ్య కోస్లా కంటే ధన పిశాచిగా నటించిన సోనాక్షి సిన్హానే అందంగా కనిపించింది. పిశాచి అంటే వకృతంగా వికారంగా కాకుండా.. అందంగా చూపించడం బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు దెయ్యాలు గురించి రీసెర్చి అంటూ సాగినా.. సెకండాఫ్ లో అసలు కథలో ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ఎంగేజ్ చేసే ప్రయత్నం చేసాడు. ఇక పిశాచి అడ్డు తొలకాలంటే .. దాని చుట్టూ.. అరుణాచలంలో ఉన్నట్టు అష్ట దిక్పాలక లింగాలను పెట్డాలని ఓ సిద్దాంతి చెబుతాడు. ఇక్కడ సిద్ధాంతి రూపంలో శుభలేఖ సుధాకర్ చెప్పే డైలాగులు కార్తికేయ 2లో కృష్ణ తత్త్వాన్ని చెప్పినట్టు ఇక శివతత్త్వాన్ని చెప్పాడు. క్లైమాక్స్ ఏదో హడావుడి ముగించినట్టు చూపించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది. ఫస్ట్ ను ఓ 20 నిమిషాలు .. సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో 15 నిమిషాలు ట్రిమ్ చేసుంటే బాగుండేది. సెకండాఫ్ లో హీరో కనపడేది కాసేపే. క్లైమాక్స్ లో హీరో సిక్స్ ప్యాక్ చూపించాలనే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. 

నటీనటుల విషయానికొస్తే.. 
సుధీర్ బాబు ఈ సినిమా కోసం తన వంతు కష్టపడ్డాడు. ఎమోషనల్ సీన్స్ లో మంచి నటన కనబరిచాడు. సోనాక్షి సిన్హా ధన పిశాచి పాత్రలో మెప్పించింది. హీరోయిన్ గా నటించి దివ్యా ఖోస్లా నటన అంతగా ఆకట్టుకోలేదు. హీరో తండ్రి పాత్రలో రాజీవ్ కనకాల, తల్లి పాత్రలో నటించిన ఝాన్సీ యాక్టింగ్  పర్వాలేదు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. 

పంచ్ లైన్.. డేవోషనల్ టచ్ తో మెప్పించే ‘జటాధర’.. 

రేటింగ్..3/5

Also Read:​  మీ ఏజ్ ప్రకారం రోజు ఎంత లిక్కర్ తీసుకోవాలి.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..

Also Read:​  చిరంజీవికి అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..భార్యగా యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News