Jayaprada: ప్రముఖ నటి జయప్రద ఇంట్లో తీవ్ర విషాదం..

Jayaprada: ప్రముఖ నటి జయప్రద ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె బ్రదర్ రాజబాబు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని జయప్రద తన సామాజిక మాధ్యమం వేదికగా తెలియజేసారు. వివరాల్లోకి వెళితే..

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 28, 2025, 09:51 AM IST
Jayaprada: ప్రముఖ నటి జయప్రద ఇంట్లో తీవ్ర విషాదం..

Jayaprada: భారతీయ  ప్యాన్ ఇండియా స్టార్ హీరోయిన్ జయప్రద ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె అన్నయ్య రాజబాబు అనారోగ్యంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఈ విషయాన్ని జయప్ర తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది. హైదరాబాద్ లో గురువారం మధ్యాహ్నం కన్నమూసినట్టు తెలిపారు.

Add Zee News as a Preferred Source

ఈ సందర్భంగా జయప్రద తన సోషల్ మీడియా అకౌంట్లో రాస్తూ .. నా అన్నయ్య.. రాజబాబు మరణ వార్తను మీదకు తెలియజేస్తున్నందుకు బాధగా ఉందంటూ పోస్ట్ చేసింది. ఈ రోజు ఆయన అంత్య క్రియలు నిర్వహించనున్నారు.

సీనియర్ నటి జయప్రద గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.  అప్పట్లోనే తెలుగు, హిందీ సహా ప్యాన్  ఇండియా భాషల్లో నెంబర్ వన్ హీరోయిన్ గా సత్తా చాటారు. ఈమె కేవలం సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లో రాణించారు.  అంతేకాదు అప్పట్లో తెలుగు దేశం తరుపున రాజ్యసభ సభ్యురాలిగా తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ తరుపున రాంపూర్ ఎంపీగా గెలిచారు.    స్పందించక పోవడంతో కోర్టు ఆగ్రహించి ఆమెకు అరెస్ట్ చేసి తమ ముందు ఉంచాలని రామ్ పూర్ ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

అంతేకాదు భారత దేశం వివిధ భాషల్లో సూపర్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కుమార్, శివాజీ గణేషణ్, కమల్ హాసన్, రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, జితేంద్ర, మిథున్ చక్రబర్తి,  సన్ని దేవోల్, చిరంజీవి వంటి స్టార్స్ సరసన నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ గా తనదైన ముద్ర వేశారు.  

అంతేకాదు నటిగా ఓ మూసకు పరిమితం కాకుండా అన్ని జానర్స్ లో నటించి మెప్పించిన అతికొద్ది మంది నటీమణుల్లో ఈమె ఒకరు. ఓ వైపు అడివి రాముడు వంటి కమర్షియల్ చిత్రాల్లో కథానాయికగా నటిస్తూనే.. అంతులేని కథ, 47 రోజులు వంటి సినిమాల్లో లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు సీతా కళ్యాణం, శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం, హిందీ లవకుశ వంటి పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించారు జయప్రద.  అటు సింహాసనం, రాజపుత్ర రహస్యం, పాతాళ భైరవి (హిందీ)వంటి జానపద చిత్రాల్లో తన నటనతో అభిమానుల మందార మాలలు అందుకున్న నటీమణి.


ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News