Devara 2: దేవరా సినిమాలో కొత్త నటులు.. ఆ పాత్రలే హైలెట్..!

Jr NTR Devara 2 దేవర మొదటి భాగం జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో మంచి విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు రెండో భాగం గురించి ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ రెండో భాగంలో ఎన్నో స్పెషల్ క్యారెక్టర్స్ దర్శకుడు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది..

Written by - Vishnupriya | Last Updated : Mar 10, 2025, 08:50 PM IST
Devara 2: దేవరా సినిమాలో కొత్త నటులు.. ఆ పాత్రలే హైలెట్..!

Devara 2 Update: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి వస్తోన్న ప్రతి సినిమా పైన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. 

Add Zee News as a Preferred Source

ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన..దేవర చిత్రం అనుకున్నట్టుగానే మంచి విజయం అందుకుంది. దాంతో ఈ సినిమా రెండో భాగం పైన మరిన్ని అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా మొదటి భాగం కన్నా రెండో భాగంలో హీరోయిన్ జాహ్నవి కపూర్ రోల్.. ఎక్కువగా ఉంటుంది అని ముందుగానే ప్రకటించారు దర్శకుడు. 

ఇక ఇప్పుడు ఈ సినిమాలో మరిన్ని క్యారెక్టర్స్ కూడా కనిపించనున్నాయి అని వినికిడి.  భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా మొదటి బాగా.. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో ఇప్పుడు రెండో భాగం పైన దర్శకుడు మరింత శ్రద్ధ పెడుతున్నట్టు వినికిడి.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దేవర 2 స్క్రిప్ట్ ఫైనల్ అయ్యిందని తెలుస్తోంది. ఇటీవల కొరటాల శివ దేవర 2 పూర్తి స్క్రిప్ట్‌ను ఎన్టీఆర్‌కు వినిపించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 సినిమాకు సంబంధించి ప్యాచ్ వర్క్ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాకు కూడా సైన్ చేశారు. అయితే ఇవన్నీ పూర్తయిన తర్వాత దేవర 2 చిత్రీకరణ ప్రారంభమవుతుందని టాక్.

అయితే మరింత ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే…ఈ రెండో భాగంలో మొదటి భాగంలో ఉన్న క్యారెక్టర్స్ కాకుండా మరిన్ని కొత్త క్యారెక్టర్స్ కనిపించనున్నాయంట. ముఖ్యంగా ఈ చిత్రం అన్ని భాషలలో విజయం సాధించడంతో వివిధ భాషలలోని.. వివిధ నటులను ఈ రెండో భాగంలో చిన్న స్పెషల్ క్యారెక్టర్స్ లో పెట్టండి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్యారెక్టర్లు అన్నీ కూడా ఎంతో స్ట్రాంగ్ గా ఉంటాయని.. అందుకు తగ్గట్టుగానే కొరటాల శివ కథ రాసుకొని జూనియర్ ఎన్టీఆర్కి వినిపించినట్టు తెలుస్తోంది. 

ఇక ఇదే కానీ నిజమైతే ఈ సినిమా రెండో భాగం మొదటి భాగం కన్నా ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకోవడం ఖాయం. మరి మొదటి భాగంతో మరింత స్టార్ స్టేటస్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్.. దేవర రెండో భాగంతో ఎన్ని రికార్డులు బద్దలు కొడతారో చూడాలి.

ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్‌పై సుధాకర్ మిక్కిలినేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దేవర 2 ఎలా ఉండబోతుందో, కథలో ఏ మలుపులు ఉంటాయో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే!

Read more: Viral Video: డైలీ మూడుసార్లు షాంపుతో హెయిర్ బాత్.. ఈ ఏనుగు హెయిర్ స్టైల్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News