NTR: మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కళ్యాణ్ కు మద్ధతుగా ఎన్టీఆర్ ట్వీట్..

NTR Emotional About Mark Shankar Incident: పవన్ కళ్యాణ్ చిన్న తనయుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో మార్క్ శంకర్ తో పాటు పలువురు చిన్నారులు గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు పలువురు బాసటగా నిలుస్తారు. ఈ నేపథ్యంలో మార్క్ శంకర్ గాయపడిన సంఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 9, 2025, 02:35 PM IST
NTR: మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కళ్యాణ్ కు మద్ధతుగా  ఎన్టీఆర్ ట్వీట్..

NTR Emotional About Mark Shankar Incident: పవన్ కళ్యాణ్ చిన్న తనయుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో మార్క్ శంకర్ తో పాటు పలువురు చిన్నారులు గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు పలువురు బాసటగా నిలుస్తారు. ఈ నేపథ్యంలో మార్క్ శంకర్ గాయపడిన సంఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.

Add Zee News as a Preferred Source

పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు జరిగిన సంఘటన తెలిసి మనసు పూర్తిగా  కలిచివేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ దేవుడు అండదండలు ఆ కుటుంబానికి ఉండాలన్నారు. లిటిల్ వారియర్ మార్క్ శంకర్ పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మార్క్ శంకర్ కు కాళ్లు, చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. మరోవైపు మార్క్ శంకర్ ను ఎమర్జన్సీ వార్డ్ నుంచి నార్మల్ వార్డ్ కు షిఫ్ట్ చేశారు. క్రమంగా కోలుకుంటున్నాడంటూ సింగపూర్ వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:  Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..

ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..

అయితే.. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ ను ఫోన్ లో ఆరా తీశారు.  అంతేకాదు మెరుగైన చికిత్స కోసం అక్కడ హై కమిషనర్ తో మాట్లాడారు మోడీ. మరోవైపు పవన్ కుమారుడికి జరిగిన ఈ ఘటనపై  ఎక్స్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు స్పందించిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు ఈ ఘటన జరిగిన తర్వాత చిరంజీవి దంపతులతో పాటు పవన్ కళ్యాణ్ సింగపూర్ బయలు దేరిన సంగతి తెలిసిందే కదా.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News