)
War 2 Pre Release Business: వార్ 2 మూవీతో ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. నటుడిగా తొలి హిందీ చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనలున్నాయి. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ‘వార్ 2’ మూవీపై అంచనాలు పెరిగాయి. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఈ సినిమా అభిమానులు రెండు కాలర్స్ ఎత్తుకునేలా ఉంటుందిని చెప్పాడు. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ లో సింగిల్ స్క్రీన్ లో రూ. 75, మల్టీప్లెక్స్ లో రూ. 100 పెంచుకునేలా అనుమతులు ఇచ్చారు.స్పెషల్ షోకు రూ. 500 వరకు టికెట్ రేట్ ఉంది. తెలంగాణలో ఉన్న సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో మన దేశంలో ఎక్కడా లేని విధంగా భారీగా ధరలు ఉన్నాయి. ఇక ఇది డబ్బింగ్ సినిమా కాబట్టి తెలంగాణలో స్పెషల్ షూస్ కు, టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు.
ఇక తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. తెలంగాణలో రూ. 36.50 కోట్లు.. రాయలసీమలో రూ. 18 కోట్లు.. ఆంధ్ర ప్రదేశ్ లో రూ. 36 కోట్లు.. ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 90.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో హిట్ అనిపించుకోవాలంటే రూ. 92 కోట్ల షేర్ రాబట్టాలి.
వార్ 2 హిందీ + ఓవర్సీస్ లో దాదాపు రూ. 125 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. మొత్తంగా ఈ సినిమా రూ. 217 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. ఈ సినిమా ఎన్టీఆర్, హృతిక్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందనేది టాక్. ఇద్దరి మధ్య యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను అలరించేలా ఉన్నాయనేది టాక్. ఇద్దరు డాన్సింగ్ స్టార్స్ తమ పాటతో అదరగొట్టేసారు. హృతిక్, ఎన్టీఆర్ పోటా పోటీ నటన ఈ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచేలా ఈ సినిమా క్లైమాక్స్ ఉండబోతున్నట్టు సమాచారం.
మొత్తంగా ఎన్టీఆర్ తన కెరీర్ పరంగా తొలిసారి కథానాయికగా లేకుండా నటిస్తుండంతో తారక్ అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి. హిందీలో ‘వార్ 2’ సినిమా 2 గంటల 53 నిమిషాల 24 సెకన్ల నిడివి ఉంది. తెలుగు, తమిళంలో ఈ సినిమా 2 గంటల 51 నిమిషాల 44 సెకన్లు నిడివి ఉంది.అజ్ఞాతంలో ఉన్న హృతిక్ ను పట్టుకునేందుకు భారత స్పై ఏజెంట్ ఎన్టీఆర్ ను పంపుతుంది. వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్స్.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఇంటర్వెల్ ఎపిసోడ్ ఈ సినిమాకు హైలెట్ గా ఉండనున్నాయి. ఈ సినిమాలో ట్విస్టులతో పాటు క్లైమాక్స్ లో మరో ఇద్దరు హీరోలున్నట్టు సమాచారం. ‘వార్ 2’ డాల్మీ అట్మాస్ లో రిలీజ్ కాబోతున్న తొలి భారతీయ సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ గురువారం రిలీజ్ కాబోతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.