Jr NTR Kalyan Ram Love: జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, “సినిమాలో చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. మీరు కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు” అని చెప్పారు. ఈ మాటలతో సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. తాను ప్రతి సారి కాలర్ ఎగరేస్తానని, ఈసారి తన అన్న కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేయాలంటూ ఫన్నీగా వ్యాఖ్యానించారు. “ప్రతి సారి నేను కాలర్ ఎగరేస్తా.. ఈసారి మా అన్న కాలర్ ఎగరేయాలి. ఆయన కాలర్ ఎగరేయలేదు కాబట్టి నేను అన్న కాలర్ ఎగరేస్తా!” అంటూ నవ్వులు పంచారు.
అంతేకాదు, “ఇప్పుడే అన్నయ్య క్లైమాక్స్ గురించి చెప్పేస్తాను.. చివరి 15 నిమిషాలు క్లైమాక్స్.. చెప్పేస్తా మరి..!” అని కళ్యాణ్ రామ్‌ను సరదాగా ఆట పట్టించగా... వెంటనే కళ్యాణ్ రామ్ వచ్చి ఎన్టీఆర్ ని హగ్ చేసుకుని వద్దు నాన్న అన్నారు. వీరిద్దరి మధ్య కనిపించిన బంధం అభిమానుల హృదయాలను గెలిచింది. స్టేజ్‌పై వారి ప్రేమను చూసి ప్రేక్షకులు గట్టిగా చప్పట్లు కొట్టారు.
అయితే ఈ ఈవెంట్‌లో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విజయశాంతి మైక్ తీసుకుని ప్రసంగం ప్రారంభించగానే అభిమానులు ఒక్కసారిగా ఎన్టీఆర్ పేరు నినాదాలు చేయడం ప్రారంభించారు. “జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడాలి” అంటూ శబ్దం పెంచడంతో ఆమె మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎన్టీఆర్ కొంత అసహనం వ్యక్తం చేస్తూ, “నన్ను వెళ్లిపోమంటారా?” అని ప్రశ్నించారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహాన్ని గమనించిన విజయశాంతి వెంటనే స్పందిస్తూ, "అభిమానులు ఎక్కువగా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ల ప్రేమ ఇది." అంటూ జూనియర్‌ను శాంతపర్చే ప్రయత్నం చేశారు. అనంతరం ఆమె తన ప్రసంగాన్ని కొనసాగించారు.
అయితే అభిమానుల మాత్రం విజయశాంతి మాట్లాడదాం మొదలుపెట్టాక కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరుని అరుస్తూనే ఉన్నారు. దీంతో వెనక జూనియర్ ఎన్టీఆర్ చాలా అసహనంగా.. ఆగ్రహంగా కనిపించారు. సాధారణంగా చాలా కూల్‌గా కనిపించే ఆయన, ఈసారి మాత్రం కొంత సీరియస్‌గా ఉన్నారు.
కాగా ఇక ఈవెంట్ మొత్తం హాస్యం, భావోద్వేగాలతో సాగింది. ఇప్పటికే ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో, జూనియర్ ఎన్టీఆర్ మద్దతు మరింత హైప్‌ను తీసుకొచ్చింది. చివరి 20 నిమిషాలపై ఎన్టీఆర్ చెప్పిన మాటలతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









