Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పై ట్రోల్స్.. ఎందుకలా అంటూ ఆందోళన..!

Jr NTR New Look:   జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ట్రోలింగ్‌కి గురైంది. అభిమానులు దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో ఎప్పుడు కనిపించాడు ఎక్కడ కనిపించారు అని సందేహంగా ఉంటే..అసలు విషయం ఏమిటో తెలుసుకోండి.  

Written by - Vishnupriya | Last Updated : Mar 8, 2025, 10:38 AM IST
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పై ట్రోల్స్.. ఎందుకలా అంటూ ఆందోళన..!

Jr NTR Trolls:
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఓ యాడ్ కోసం కొత్త లుక్‌లో కనిపించారు. గుబురు గడ్డం, షార్ట్ హెయిర్, బ్లూ కలర్ హుడీ ధరించిన ఆయన లుక్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కొంతమంది అభిమానులు ఈ లుక్‌ను ప్రశంసిస్తుండగా, మరికొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.  

Add Zee News as a Preferred Source

జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఓ క్విక్ కామర్స్ సంస్థ ZEPTO.. తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్ తన స్టైలిష్ లుక్‌తో కనిపించగా, అతని హెయిర్ స్టైల్‌పై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ లుక్ ఆయనకు సరిగా సరిపోలేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.  

ఎన్టీఆర్ లుక్‌పై సోషల్ మీడియాలో భిన్నమైన రియాక్షన్లు వ్యక్తమవుతున్నాయి. కొందరు అభిమానులు, "ఇదేంటీ బాబు.. ఇది ఎన్టీఆర్ లుక్ అవుతుందా?" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు అయితే ఇది తాత్కాలిక లుక్ మాత్రమేనని, రాబోయే సినిమాల్లో మెరుగైన లుక్‌లో కనిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

ఇటీవలే విడుదలైన ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా మారారు.  

ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’లో నటిస్తున్నారు. ఈ సినిమా బాలీవుడ్‌లో ఆయనకు డెబ్యూ అవ్వడంతో ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్, హృతిక్‌ల మధ్య గ్రాండ్ డాన్స్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారు.  

‘వార్ 2’ తర్వాత ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.  

ఎన్టీఆర్ లుక్‌పై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఇప్పటివరకు ఆయన ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే, ఇదంతా తాత్కాలికమేనని, త్వరలోనే మరింత మెరుగైన లుక్‌తో కనిపిస్తారని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.  

Also read: EPFO Services In ATM: ఈపీఎఫ్‌ సభ్యులకు శుభవార్త.. భవిష్యత్‌లో ఏటీఎం నుంచి సేవలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్- https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్- https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News