Jr NTR Praises Sankranthi Movie: సంక్రాంతి కి వచ్చిన సినిమాను తెగ మెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్.. నటుడు పై ప్రశంసలు..!

Jr NTR Praises Sankranthi Movie: సాధారణంగా ఇతర సినిమాలపై జూనియర్ ఎన్టీఆర్ చాలా అరుదుగా సోషల్ మీడియాలో స్పందిస్తారు. ముఖ్యంగా కొత్త సినిమాలపై ట్వీట్ చేయడం ఆయన నుంచి చాలా తక్కువగా కనిపిస్తుంది. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ తాజాగా విడుదలైన సినిమాపై స్పందించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది...  

Written by - Vishnupriya | Last Updated : Jan 20, 2026, 11:29 AM IST
Jr NTR Praises Sankranthi Movie: సంక్రాంతి కి వచ్చిన సినిమాను తెగ మెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్.. నటుడు పై ప్రశంసలు..!

Jr NTR Praises Sankranthi Movie: ఇటీవల విడుదలై మంచి ప్రశంసలు అందుకున్న సామాజిక నేపథ్య చిత్రం డండోరా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఓటిటి లోకి వచ్చింది.. ఈ సందర్భంగా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాపై స్పందిస్తూ ట్విట్టర్‌లో ప్రత్యేకమైన పోస్ట్ చేశారు. సినిమా చూసిన వెంటనే తన అభిప్రాయాన్ని ఆయన అభిమానులతో పంచుకున్నారు.

Add Zee News as a Preferred Source

“జస్ట్ వాచ్‌డ్ డండోరా. చాలా లోతైన ఆలోచనలకు దారితీసే శక్తివంతమైన సినిమా. శివాజీ గారు, నవదీప్, నందు, రవి కృష్ణ, బిందు మాధవి అందరూ మొదటి నుంచి చివరి వరకూ అద్భుతమైన నటన చేశారు” అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. నటీనటులందరి ప్రదర్శన సినిమా స్థాయిని మరింత పెంచిందని ఆయన స్పష్టంగా చెప్పారు.

అలాగే దర్శకుడు మురళీకాంత్ గారిపై కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు. “బలమైన కథను ఎంతో సహజంగా..ఉండే కథలా తెరకెక్కించినందుకు మురళీకాంత్ గారికి హ్యాట్సాఫ్” అని పేర్కొన్నారు. నిర్మాత రవీంద్ర బెనర్జీ గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ..ఇలాంటి మంచి ప్రయత్నానికి మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. మొత్తం డండోరా టీమ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

డండోరా సినిమా 2025 డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా కథ రెండు కాలాల్లో సాగుతుంది. ఒక భాగం 2004 సంవత్సరంలో జరుగుతుంది. ఇందులో కులభేదాల.. మధ్య ప్రేమ.. ఆ ప్రేమను అంగీకరించని సమాజం..దాని వల్ల జరిగే సంఘటనలను చూపించారు. ధనవంతుడైనా సరే కులం కారణంగా ప్రేమను తిరస్కరించడం వల్ల ఎలా విషాదకరమైన పరిణామాలు ఎదురవుతాయో.. స్పష్టంగా చూపించారు.

ఇక ..ప్రస్తుత కాలానికి వచ్చినప్పుడు శివాజీ పాత్ర మరణం తర్వాత కథ మలుపులు తిరుగుతుంది. ఆయన కుమారుడు విష్ణు పాత్ర.. గ్రామ సర్పంచ్‌గా నవదీప్ నటన కథకు బలంగా నిలిచాయి. ఒక్కో నిజం బయటపడుతున్న కొద్దీ కొత్త ప్రశ్నలు తలెత్తుతాయి. ఆ ప్రశ్నలకి సమాధానమే ఈ సినిమా కథ..

థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులకు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. డండోరా సినిమా జనవరి 14 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

 

Also Read: Akshay Kumar Car Accident: హీరో అక్షయ్ కుమార్ కారుకు ఘోర ప్రమాదం..కారులో అక్షయ్, ట్వింకిల్..ఆటోని ఢీకొని గాల్లోకి అమాంతం!

ALso Read: Union Budget 2026: 8వ వేతన సంఘం జీతాల పెంపు..2026 కేంద్ర బడ్జెట్‌పై ప్రభావం ఎంత? ఉద్యోగుల కష్టాలు తీరేది ఎన్నడో?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News