)
Kantara Chapter 1: తన చిన్నప్పటి నుంచి విన్న కథలతో సినిమా రూపొందుతుందని తాను ఊహించలేదని.. అలా తీసిన సినిమా విజయం సాధించడం విశేషమని స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. అమ్మమ్మ చెప్పిన కథలు నిజ రూపకంగా రావడంపై హర్షం వ్యక్తం చేశారు. 'నాకు మూడేళ్ల వయసున్నప్పుడు అమ్మమ్మ కుందాపుర సమీపంలోనే మన ఊరు అని చెప్పేది. దానికి సంబంధించిన కథలు చెప్పేది. అవన్నీ నాకు నచ్చేవి' అని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. ఇలా నిజంగానే జరుగుతుందా? అని తనకెన్నో సందేహాలొచ్చేవని తెలిపారు. గుళిగ, పంజుర్లి గురించి తెలుసుకోవాలనిపించేదని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
స్వీయ దర్శకత్వంలో కన్నడ నటుడు రిషబ్‌శెట్టి చేస్తున్న కాంతారాకు ప్రీక్వెల్ ‘కాంతార చాప్టర్ 1’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎన్టీఆర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని అభినందించారు. ఇటీవల గాయపడడంతో ఆ కారణంగా తాను గతంలో మాదిరి గట్టిగా మాట్లాడలేనని.. అర్థం చేసుకోవాలని అభిమానులకు ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు.
అనంతరం ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తాను విన్న ఆ కథలతో ఓ దర్శకుడు సినిమా తెరకెక్కిస్తాడని అనుకోలేదని తెలిపారు. దాన్ని రిషబ్‌శెట్టి సాధ్యం చేశాడని అభినందించారు. తన బాల్యంలో విన్న కథలను తెరపై చూసి ఆశ్చర్యపోయినట్లు ఎన్టీఆర్ చెప్పారు. దాని గురించి మాటల్లో చెప్పలేనని.. కథ తెలిసి నేనే ఇలా అయిపోతే.. కొత్తగా తెలుసుకున్న వారు ఏమయ్యారో అదే ‘కాంతార’ ఫలితం అని ఎన్టీఆర్ వెల్లడించారు. 'అరుదైన దర్శకుడు, నటుడు రిషబ్. ఆయనలోని నటుడిని దర్శకుడు, డైరెక్టర్‌ను యాక్టర్ డామినేట్ చేయడం కాదు.. 24 విభాగాలను డామినేట్ చేస్తారు' అని రిషబ్‌పై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు.
‘కాంతార’ను ఈ స్థాయిలో తెరకెక్కించడం మరెవరి వల్ల సాధ్యమయ్యేది కాదని ప్రకటించారు. 'మా అమ్మను ఉడుపి కృష్ణుడి ఆలయానికి తీసుకెళ్లాలనేది ఎప్పటి నుంచో నా కోరిక. రిషబ్‌తో ఆ దర్శన భాగ్యం దక్కింది. తమ పనుల్నీ పక్కనపెట్టి రిషబ్ కుటుంబం మాతో కలిసి వచ్చింది. నన్ను కుటుంబసభ్యుడిగా చూసుకున్నారు' అని రిషబ్‌తో తన అనుబంధాన్ని ఎన్టీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలోనే రిషబ్ కాంతార చాప్టర్ 1 కోసం ఎంత కష్టపడుతున్నారో అర్థమైందని చెప్పారు. ఈ సినిమాను తీయడం అనుకున్నంత తేలిక కాదన్నారు. రిషబ్ శెట్టి నటించిన దర్శకత్వం చేసిన కాంతారా చాప్టర్ 1లో హీరోయిన్గా రుక్మిణీ వసంత్ చేస్తోంది. ఈ సినిమా అక్టోబరు 2వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook