Jr NTR Role: వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించేది ఎంతసేపో తెలుసా..?

Jr NTR Role Length in War 2: ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.  ఆ తర్వాత వచ్చిన దేవర కూడా ఈయనకు మంచి విజయం అందించింది. ఈ క్రమంలో తదుపరి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి రానన్న వార్ 2 సినిమా గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి.

Written by - Vishnupriya | Last Updated : May 5, 2025, 12:17 PM IST
Jr NTR Role: వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించేది ఎంతసేపో తెలుసా..?

Jr NTR Screen Time In War 2: వార్ 2 సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రం.. యష్ రాజ్ ఫిలింస్ రూపొందిస్తున్న స్పై యూనివర్స్‌లో ఓ కీలక ఘట్టంగా నిలవబోతోంది. హృతిక్ రోషన్  వార్ సినిమాలో 'కబీర్' అనే పాత్రలో కనిపించనున్నారు. ఆల్రెడీ హిందీలో తెరకెక్కి మంచి విజయం సాధించిన వార్ సినిమాకి సీక్వెల్ గా రానుంది ఈ చిత్రం.

Add Zee News as a Preferred Source

కాగా హృతిక్ రోషన్ వార్ సినిమాలో తను పోషించిన పాత్రనే వార్ 2 కూడా కంటిన్యూ చేస్తుండగా.. ఈ సినిమాలో కొత్తగా జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ యాడ్ అవ్వడంతో.. ఈ పాత్ర ఎలా ఉండబోతుంది అంటూ అందరూ ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు. 

అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కేవలం కాసేపే కనిపిస్తారేమో అన్న అనుమానాలు మొన్నటి వరకు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులకు ఒక శుభవార్త వినిపిస్తోంది. అదేమిటి అంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు దాదాపు 75 నుంచి 80 నిమిషాల స్క్రీన్ టైమ్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే, RRR సినిమాలో ఆయనకు ఉన్న 74 నిమిషాల స్క్రీన్ టైమ్ కంటే.. కూడా వార్ సినిమాలో ఆయన పాత్ర ఎక్కువ ఉండబోతుంది. అంటే ఎన్టీఆర్ పాత్రను ఎంతో కీలకంగా చూపించే అవకాశం ఉంది. అయితే ఒక నటుడు అంతసేపు కనిపించాలంటే సినిమా మొత్తం.. నిడివి మూడు గంటలు ఉండాల్సి ఉంటుంది.

కాబట్టి ఈ చిత్రం మూడు గంటల పైనే ఉండొచ్చు అని.. ఇక ఏ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్.. హృతిక్ రోషన్.. సమానంగా ప్రాధాన్యత ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి.  ఇప్పటివరకు యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో వచ్చిన సినిమాలన్నీ 150–160 నిమిషాల వరకు మాత్రమే ఉండేవి. కానీ ఇటీవల Animal, Pushpa: The Rule లాంటి సినిమాలు మూడు గంటలకు పైగా నిడివి ఉన్నా విజయం సాధించడంతో.. వార్ 2 కూడా ఎక్కువ నిడివితో తీయాలి అనుకుంటున్నారు అనే వార్త కూడా వైరల్ అవుతుంది. 

ఇటీవల హృతిక్ జపాన్ కత్తితో యాక్షన్ సీన్స్ చేస్తూ కనిపించిన ఓ లీక్‌డ్ వీడియో..  సినిమాపై హైప్‌ను పెంచింది. ఇక ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఉండడం వల్ల తెలుగు ఇండస్ట్రీలో కూడా భారీ బిజినెస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారని.. రూ.100 కోట్లు కంటే ఎక్కువ ధరకు వీటిని కొనాలని చూస్తున్నారని సమాచారం.

ఈ సినిమాకు ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగష్టు 14న సినిమా విడుదల కానుంది. అదే రోజున రజనీకాంత్ నటించిన.. కూలీ కూడా రిలీజ్ అవుతోంది. దీంతో రెండు పెద్ద సినిమాల మధ్య భారీ క్లాష్ జరగనుంది. కాగా ఈ సినిమాలో..ఎన్టీఆర్ పాత్ర ఎంత బలంగా ఉంటుందో, ఆయన స్క్రీన్ టైమ్ ఎంత వరకు ప్రభావం చూపుతుందో చూడాలంటే ఇంకా కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

READ ALSO:  నేటి రాశిఫలాలు.. నేడు విజయ ఢంకా మోగించనున్న రాశి ఇదే..  

READ ALSO:  కుదుళ్ల ఆరోగ్యానికి వంటింట్లో ఉండే ఈ 10 వస్తువులను కొబ్బరి నూనెలో కలిపి రాయండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News