Jr NTR New Look: టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఓ పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొని అభిమానులను అలరించారు. చాలా రోజుల తర్వాత అభిమానుల మధ్యకు వచ్చిన ఎన్టీఆర్ తన కొత్త లుక్‌తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ కోసం లుక్స్ పరంగా ఎంతగానో మారిపోయిన ఎన్టీఆర్.. చర్చనీయాంశంగా మారారు. ఇదిలా ఉండగా, ఆయన చేసిన ఓ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Jr NTR Personal Life Interview : ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ, అక్కినేని నాగేశ్వరరావు (ANR) గారు రొమాంటిక్ సినిమాల్లో చేసిన పని తనను ఎంతో ఆకట్టుకుందని చెప్పారు. దేవదాసు లాంటి లెజెండరీ సినిమాల్లో చేసిన పాత్రలు, ప్రేమ కథల్లో చూపిన మాధుర్యం ఎన్టీఆర్‌కు ప్రత్యేకంగా నచ్చిందని వెల్లడించారు. ANRని కింగ్ ఆఫ్ రొమాన్స్ అని పిలవడం వింతేమీ కాదు అంటున్నారు తారక్. ఆయన లవ్ స్టోరీస్ చూసి చాలా మంది ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడేవారట.
Jr NTR About ANR: ఎన్టీఆర్ చేసిన ఓ ఆసక్తికర వ్యాఖ్య ప్రస్తుతం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. తాను రొమాన్స్‌లో బలహీనుడిననే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తన భార్య కూడా తన రొమాంటిక్ నేచర్ అప్పుడప్పుడూ కామెంట్స్ చేస్తుందని చెప్పారు. రమ్యకృష్ణతో జరిగిన ఓ చిట్‌చాట్‌లో ఈ విషయాన్ని బయటపెట్టిన తారక్, తాను ANR గారిలో ఉన్న రొమాంటిక్ ఫీలింగ్‌ని తనలో కూడా ఉండాలని కోరుకునేవాడినని తెలిపారు.
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే ప్రాజెక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో హృతిక్ రోషన్‌తో కలిసి బాలీవుడ్‌లో ‘వార్ 2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా 2025 ఆగస్ట్ 14న విడుదల కానుంది.
మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 రూపొందనుంది. త్వరలోనే నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో మరో కొత్త సినిమా ప్రకటన చేయబోతున్నట్టు MAD 2 ఈవెంట్‌లో ఎన్టీఆర్ ప్రకటించారు.
ఇదీ చదవండి: ట్రంప్ సర్కారుపై అమెరికావ్యాప్తంగా భారీ నిరసనలు.. వీడియో వైరల్
ఇదీ చదవండి: నేటి రాశిఫలాలు.. ఈరాశికి కుటుంబ సమస్యల నుంచి కాస్త ఉపశమనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









