Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన కేఏ పాల్.. బాబుకో న్యాయం..బన్నికో న్యాయమా..
Allu Arjun Arrest: ‘పుష్ప 2’ విడుదల సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటనలో పోలీసులు అరెస్ట్ పర్వానికి తెర లేపారు. ఈ కేసులో ఇప్పటికే ఇప్పటికే సంధ్య థియేటర్ కు సంబంధించిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. ఈ అరెస్ట్ ను కొందరు స్వాగతిస్తూ ఉండగా.. మరికొందరు ఇది ప్రభుత్వ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేఏ పాల్ అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించారు.
Allu Arjun: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య టాకీస్ లో జరిగిన తొక్కిలలాటలో తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పుష్ప 2 విడుదల సందర్బంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిలసలాట నేపథ్యంలో రేవతి అనే మహిళా మృతిచెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై భారతయ న్యాయ సంహిత ప్రకారం 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. తాజాగా అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్ ను కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ ఖండించారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో రేవంత్ సర్కార్ అమానుషంగా ప్రవర్తిస్తుందన్నారు. అటు కేటీఆర్ కూడా ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఓ మహిళ మృతి చెందింది. ఈ విషయంలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అన్నారు. మరోవైపు ఈ అరెస్ట్ ను కేఏ పాల్ ఖండించారు.
అప్పట్లో చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్లినపుడు తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు. గుంటూరులో ముగ్గురు.. పుష్కరాల్లో 23 మంది చనిపోయారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారా? రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? అని కేఏ పాల్ప ప్రశ్నించారు.
మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్ ను వైసీపీ నాయకురాలు.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఖండించారు. అల్లు అర్జున్ అరెస్టు బాధాకరమని, ప్రతిదానిలో చంద్రబాబు నాయుడు హస్తం ఉందని పేర్కొన్నారు. సినిమా ఎలా ఉంది చూడటానికి అల్లు అర్జున్ వెళ్లాడు.. అయితే, అల్లు అర్జున్ వెళ్లినప్పుడు అక్కడ ఏర్పాట్లు చేయని రేవంత్ సర్కారు తప్పు. ఏ తప్పు చేయని అల్లు అర్జున్ ను అరెస్టు చేశారని లక్ష్మీపార్వతి అన్నారు. రాజమండ్రి పుష్కరాల్లో, కందుకూరులో ఘటనల సమయంలో మచి చంద్రబాబును ఎన్నిసార్లు అరెస్టు చేయాలని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఏపీలో చంద్రబాబు.. అక్కడ ఆయన శిష్యుడు రేవంత్ ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో రాక్షస పాలన సాగుతోందని లక్ష్మీపార్వతి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
అయితే.. అల్లు అర్జున్ అరెస్ట్ పై ఆయన కామన్ పీపుల్, న్యాయ నిపుణులు, అభిమానులు మరోలా స్పందిస్తున్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ దుర్మరణం చెందడం చాలా దురదృష్టకరమన్నారు. అయితే భారీ జనసందోహాన్ని అదుపు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఇది ఎత్తిచూపుతుందన్నారు.
ఇంతటి హైప్రొఫైల్ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడమే అసలైన వైఫల్యమన్నారు. రేవంత్ సర్కార్ కక్ష్య పూరితంగానే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిందంటున్నారు. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రవర్తన ఆమోదయోగ్యం కాదన్నారు.
ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..
ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.