Kaalamega Karigindhi review: ‘కాలమే కరిగింది’ మూవీ రివ్యూ..

Kaalamega Karigindhi movie review: తెలుగులో ఇప్పటి వరకు ఎన్నో ప్రేమకథా చిత్రాలొచ్చాయి. అందులో స్కూల్ డేస్ ప్రేమతో తెరెకెక్కినవి వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అలాంటి ప్రేమ కథతో తెలుగులో వచ్చిన తాజా చిత్రం ‘కాలమే కరిగింది’ . న్యూ ఏజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 22, 2025, 12:47 PM IST
Kaalamega Karigindhi review: ‘కాలమే కరిగింది’ మూవీ రివ్యూ..

ఈ మధ్యకాలంలో కొత్తగా చిత్రపరిశ్రమలో అడుగుపెడుతున్న దర్శకులు ఎక్కువగా ప్రేమ కథా చిత్రాలతో పరిచయమవుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త దర్శకుడు సింగర మోహన్ .. న్యూ ఏజ్ ప్రేమ కథగా ‘కాలమే కరిగింది’ సినిమాను తెరకెక్కించాడు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే..

Add Zee News as a Preferred Source

కథ విషయానికొస్తే..
ఫణి (వినయ్ కుమార్ ) యువ పారిశ్రామిక వేత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకుంటాడు. ఈ క్రమంలో తాను పుట్టి పెరిగిన గ్రామాన్ని తన చిన్ననాటి స్నేహితుడుతో కలిసి  సందర్శిస్తాడు. ఈ క్రమంలో తాను చదువుున్న స్కూల్ సహా ఇతర జ్ఞాపకాల లోకంలో విహారిస్తుంటాడు. 10వ తరగతి చదువుతున్నపుడు తన తోటి విద్యార్ధిని బిందు (శ్రావణి మజ్జారి)తో తొలి ప్రేమ సంగతులను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అయితే.. స్కూల్ ఏజ్ లో చిగురించిన వాళ్ల ప్రేమకు ఎక్కడ బ్రేకులు పడ్డాయి. ఎంతో అన్యోన్యంగా ఉన్న వీళ్లిద్రు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది. విడిపోయిన వీళ్లిద్దరు చివరకు ఒకరినొకరు కలుసుకున్నారా లేదా అనేదే తెలియాంటే ఈ సినిమా చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

ఈ సినిమా ప్లాట్ చూస్తే.. రవితేజ హీరోగా నటించిన ‘ఆటోగ్రాఫ్.. స్వీట్ మెమరీస్’ సినిమా ఛాయలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా హీరో యువ పారిశ్రామిక వేత్తగా కేంద్రం గుర్తించే రేంజ్ కు ఎదిగుతాడు. దీంతో తాను చదవుకున్న ఊరుకు స్నేహితుడుతో  కలిసి బయలు దేరుతాడు. ఈ క్రమంలో తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటాయి. ఈ సినిమాను దర్శకుడు ఊరిలో  ఓ స్కూల్,  డజనను లోపు క్యారెక్టర్స్ తో తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఔట్ పుట్ రాబట్టాడు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ 10వ తరగతిలో మొదలైన  ప్రేమను ఎంతో హృద్యంగా చిత్రీకరించారు. ముఖ్యంగా ప్రేమ పేరుతో ప్రస్తుతం యూత్.. తమ లక్ష్యాలను మరిచిపోయి.. ఎటు కాకుండా పోతున్నారు. ముందు కెరీర్..ఆ తర్వాత ప్రేమ అనే విషయాన్ని దర్శకుడు ఈ సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్  బాగుంది. మరోవైపు 10వ తరగతిలోనే ప్రేమ వ్యవహారాలు.. హీరో, హీరోయిన్స్ మధ్య ముద్దు సన్నివేశాలు  క్యాజువల్ గా అనిపించినా.. కొన్ని చోట్ల ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. ఇందులో యువ ప్రేమికుల మధ్య హగ్ సీన్స్ కొంచెం ఇబ్బంది పెడతాయి. మొత్తంగా యూత్.. ప్రేమ పేరుతో టైమ్ పాస్ చేయకుండా...చదువుపై శ్రద్ద పెట్టి.. ఉన్నత స్థానానికి చేరుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలనే పాయింట్ మాత్రం హైలెట్ గా ఉంది.

సినిమాలో హీరో, హీరోయిన్, ఓ స్నేహితుడి పాత్ర చుట్టే కథను అల్లుకున్నాడు. చిన్నప్పటి హీరో, హీరోయిన్, హీరో స్నేహితుడు పాత్రలే కనిపిస్తాయి. వాళ్ల పేరేంట్స్ బ్యాక్ గ్రౌండ్, తదితర విషయాలను ఎక్కువ టచ్ చేయలేదు. ఓ ఊర్లో ఓ పాఠశాల విద్యార్ధిని విద్యార్ధుల మధ్య జరిగే లవ్ స్టోరీ ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఉండదు. అలాంటి అంశాలను టచ్ చేయకుండా.. తాను రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం పోయిటిక్ గా వెళ్లిపోయాడు. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫోటోగ్రఫీ బాగుంది. సినిమా మొత్తం ఫాస్ట్ గా కాకుండా స్లో నేరేషన్ లో సాగడం కాస్త ఇబ్బంది పెట్టే అంశం. ఈ సినిమాను ఇంకా కుదించి ట్రిమ్ చేసుంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చేది. అయినా.. కొత్త నటీనటులతో ఇలాంటి ఔట్ పుట్ రాబట్టడం మాములు విషయం కాదు. తక్కువ బడ్జెట్ లో కేవలం ఒకటి రెండు లొకేషన్స్ లోనే సినిమా మొత్తాన్ని ఎలా తీయోచ్చో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.

నటీనటుల విసయానికొస్తే..
హీరో వినయ్ కుమార్ పేరుకు మాత్రమే హీరో.. కానీ సినిమా మొత్తం చిన్ననాటి పాత్ర వేసిన అరవింద్ ముదిగొండ చుట్టే తిరుగుతుంది. ఇక హీరోయిన్ గా నటించిన శ్రావణి మజ్జారి పాత్ర చివర్లో కనిపిస్తోంది. సినిమా మొత్తంగా ఆమె చిన్ననాటి బిందు  పాత్రలో నటించిన నోమియేనా తార తన పాత్రలో లీనమై నటించింది. చిన్నప్పటి హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన రాజు కామోజీ తన పాత్రకు న్యాయం చేసాడు.

పంచ్ లైన్.. చిన్ననాటి ప్రేమ  జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చే.. ‘కాలమేగా కరిగింది..?

రేటింగ్: 2.75/5

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News