Kalpika: పబ్ లో నటి రచ్చ.. అన్ని విసిరేసి.. ఏమైనా చేసుకోండి అంటూ.. ఇదెక్కడి పిచ్చి రా నాయనా?

Kalpika Ganesh pub controversy: నటి కల్పిక గణేష్ కి సంబందించి తాజాగా ఓ పబ్బులో జరిగిన గొడవ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే.అయితే సబ్స్క్రైబర్ల కోసమే ఈ గొడవ అంతా వీడియో తీసినట్టు తాజాగా చెప్పుకొచ్చింది. 

Written by - Vishnupriya | Last Updated : Jun 2, 2025, 08:51 PM IST
Kalpika: పబ్ లో నటి రచ్చ.. అన్ని విసిరేసి.. ఏమైనా చేసుకోండి అంటూ.. ఇదెక్కడి పిచ్చి రా నాయనా?

Kalpika Ganesh viral video: కొంతమంది సెలబ్రిటీలు ఫేమస్ అవ్వడం కోసం ఏ పనైనా చేసేస్తారు.అది వివాదాస్పదం అవుతుందని తెలిసినా కూడా ఫేమస్ అవ్వడం కోసం దేనికైనా రెడీగా ఉంటారు. అలా తాజాగా కల్పిక గణేష్ చేసిన పని అలాగే ఉంది.. 

Add Zee News as a Preferred Source

నటి కల్పిక గణేష్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్స్ పోషిస్తూ కల్పిక గణేష్ ఫేమస్ అయింది. అలా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద, నమో వెంకటేశా,జులాయి, సారొచ్చారు, హిట్-1, పడి పడి లేచే మనసు వంటి సినిమాల్లో చేసింది. అయితే అలాంటి ఈ హీరోయిన్ తాజాగా పబ్ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే.

 

మే 31న కల్పిక గణేష్ బర్త్డే కావడంతో ఆమె తన ఫ్రెండ్స్ అందరికీ ఒక ఫేమస్ పబ్ లో పార్టీ ఇచ్చింది.ఆ పబ్లో ఆమె కేక్ కట్ చేసే సమయంలో కేక్ కి కాంప్లిమెంటరీగా రావల్సిన కేక్ విషయంలో పబ్ సిబ్బందికి కల్పికకి గొడవ జరగడంతో ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే పబ్లో గొడవ జరుగుతున్న విషయం తెలిసి పోలీసులు వెంటనే ఆ పబ్ కి వచ్చి పబ్ సిబ్బందికి కల్పిక గణేష్ కి మధ్య జరిగిన గొడవను సర్దుమనిగేలా చేశారు.

 

ఆ తర్వాత అంతా సర్దుమనిగింది అనే లోపే పబ్ యాజమాన్యంపై కల్పిక గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో మరోసారి ఈ విషయం వైరల్ గా మారింది. అయితే తాజాగా పబ్ లో జరిగిన గొడవని కల్పిక గణేష్ లైవ్ లో ఎందుకు పెట్టిందో చెప్పుకొచ్చింది. నేను సోషల్ మీడియా లో పబ్ గొడవ లైవ్ వీడియో పెట్టడానికి ఒక కారణం ఉంది.నాకు సబ్స్క్రైబర్లు కావాలి. ఈ వీడియో వల్ల మరింత మంది నన్ను ఫాలో అవుతారు. 

 

కేవలం సబ్స్క్రబర్ ల కోసమే ఈ వీడియో తీశాను.నాకు కాంట్రవర్సీలే కావాలిరా నాయనా..అందుకోసమే ఇలా చేశాను అంటూ చెప్పుకొచ్చింది.అయితే కల్పిక గణేష్ ఇచ్చిన ఆన్సర్ చాలామంది జనాలకి నచ్చలేదు. ఫాలోవర్స్ కోసం ఎలాంటి పని అయినా చేస్తావా.. ఛీ నీ సబ్స్క్రైబర్ల పిచ్చి తగలెయ్యా అంటూ కామెంట్లు పెడుతున్నారు.. అయితే చాలామంది వివాదాల వల్ల ఫేమస్ అవుతారు. అలాగే కల్పిక గణేష్ కూడా ఫేమస్ అవుదాం అనుకుంది కావచ్చు.

Also Read:  NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..

Also Read:  Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News