మూవీ రివ్యూ: అర్జున్ S/O వైజయంతి (Arjun S/O Vyjayanthi)
నటీనటులు: కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, సోహైల్ ఖాన్, పృథ్వీ, తదితరులు
సంగీతం: అజనీష్ లోకనాథ్
ఎడిటర్: తమ్మిరాజు
సినిమాటోగ్రఫీ: రామ్ ప్రసాద్
నిర్మాత: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
విడుదల తేది: 18-4-2025
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘అర్జున్ S/O వైజయంతి’. విజయశాంతి నటించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. పైగా టీజర్, ట్రైలర్ తో ఆ అంచనాలు ఆకాశాన్ని అందాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
అర్జున్ (నందమూరి కల్యాణ్ రామ్) కొన్ని పరిస్థితుల కారణంగా ఐపీఎస్ కావాల్సిన అతను క్రిమినల్ గా మారుతాడు. అతని తల్లి వైజయంతి (విజయశాంతి) ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. ఆమె తన కుమారుడు కూడా తనలాంటి ఐపీఎస్ ఆఫీసర్ కావాలని ఆశిస్తుంది. అంతేకాదు విశాఖ పట్నంలో పారలల్ గవర్నమెంట్ రన్ చేస్తూ ఉంటాడు. అంతేకాదు అక్కడ అతడు మాఫియా డాన్‌లను ఎదుర్కొని సామాన్య ప్రజల కోసం పోరాడుతూ ఉంటారు. ఇది తల్లి వైజయంతికి నచ్చదు. అసలు ఐపీఎస్ కావాల్సిన కళ్యాణ్ రామ్ ఎందుకు క్రిమినల్ గా మారాడు. మరోవైపు ముంబైలో డాన్ గా ఉన్న పఠాన్ (సోహైల్ ఖాన్)ను వైజయంతి పట్టుకుటుంది. అతనికి కోర్టు ఉరి శిక్ష విధిస్తుంది. కానీ అతను విజయశాంతి పై పగపడతాడు. ఆమెను చంపాలని ప్రయత్నిస్తాడు. అంతేకాదు తనను పట్టించిన వైజయంతిని చంపాలని జైలు నుంచి తప్పించుకుంటాడు ఉరిశిక్ష పడ్డ ఘియాజిద్దిన్ పఠాన్. ఈ నేపథ్యంలో తల్లి వైజయంతి ప్రాణాలను రక్షించడానికి కుమారుడు అర్జున్ ఏం చేసాడు. చివరకు ఏం జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం, విశ్లేషణ ..
దర్శకుడు ఈ సినిమాను తల్లి కొడుకుల అనుబంధం నేపథ్యంలో చక్కగా కథను రాసుకున్నాడు. ముఖ్యంగా తల్లి కొడుకుల మధ్య అనుబంధాన్ని తెరపై చక్కగా పండింది. ఇక తల్లి పుట్టినరోజున ఎక్కడున్న వెళ్లి కొడుకుగా తల్లికి విషెస్ చేయడం వంటి సీన్స్ ప్రతి ఒక్కరిని కదిలిస్తాయి. తల్లి-కొడుకు ఎమోషనల్ ట్రాక్ తో పాటు సెంటిమెంట్స్ సీన్స్ పండాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. ముఖ్యంగా ఐపీఎస్ కావాల్సిన అర్జున్ ఎందుకు గ్యాంగ్ స్టర్ గా మారాడు. చట్టానికి లొంగిపోదామనుకున్నా.. వ్యవస్థ అతన్ని మారనీయకుండా.. గ్యాంగ్ స్టర్ ను చేయడం వంటి సీన్స్ బాగున్నాయి. కొన్ని చోట్ల యాక్షన్ సీన్స్ రొటిన్ గా ఉన్నా.. కమర్షియల్ పరంగా కథను రాసుకున్న విధానం బాగుంది.
సినిమా ప్రీ క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. చివర్లో విలన్ .. తల్లి వైజయంతి చంపడానిక ముంబై నుంచి వైజాగ్ రావడం.. అక్కడ తల్లిని కాపాడుకోవడం కోసం కొడుకు చేసే త్యాగం తెరపై చూస్తేనే బాగుంటుంది. దర్శకుడు ఈ సినిమాను తల్లి కొడుకుల సెంటిమెంట్ చూపిస్తూనే యాక్షన్ సీన్స్ మెప్పించేలా ఉన్నాయి. ఇలాంటి కథలు కొత్త కాకపోయినా.. దాన్ని దర్శకుడు మలిచిన విధానం ఆకట్టుకునే విధంగా ఉంది. రొటిన్ కమర్షియల్ మూవీకి తల్లి కొడుకుల సెంటిమెంట్ యాడ్ చేసి పైసా వసూల్ గా తెరకెక్కించడంలో సక్ససె అయ్యాడు దర్శకుడు.
ఈ సినిమా చివరి 20 నిమిషాలు.. ఆకట్టుకునే విధాంగా ఉన్నాయి. యాక్షన్ బ్లాక్స్ మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా.. క్లాస్ ప్రేక్షకులకైతే ఇది ఓవర్ డోస్ అనిపించక మానవు.
సాంకేతికంగా చూసుకుంటే, నిర్మాతలు మంచి బడ్జెట్ ఖర్చు ఖర్చు పెట్టారు. యాక్షన్ సన్నివేశాలు మంచి స్థాయిలో తెరకెక్కించారు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి మాస్ యాక్షన్‌కు కావలసిన మేకింగ్ చూపించారు. తొలి చిత్రం ‘రాజా చేయి వేస్తా’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని సరైన మాస్ ఎలిమెంట్స్ తో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడనే చెప్పాలి. అజనీష్ లోకనాథ్ ఆర్ఆర్ బాగుంది. సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ బాగున్నాయి.
నటీనటుల పర్ఫామెన్స్..
నందమూరి కల్యాణ్ రామ్ అర్జున్ పాత్రకు 100 శాతం న్యాయం చేశాడు. యాక్షన్ కమ్ సెంటిమెంట్ సీన్స్ లో భావోద్వేగాలను పండించాడు. ఇక ఈ సినిమాలో విజయశాంతి ఎందుకు తీసుకున్నారో సినిమా చూస్తే తెలుస్తోంది. 60కి దగ్గర పడుతున్న విజయశాంతి తన ఈజ్ తో కొన్ని యాక్షన్ సీన్స్ లో ఇరగదీసింది. అంతేకాదు ఈ పాత్రకు ఆమె సెలెక్షన్ 100 శాతం కరెక్ట్. ఈ క్యారెక్టర్ కు రాములమ్మ తప్ప మరొకరిని ఊహించుకోలేము. మంచి పాత్రలు వస్తే ఇరగదీయడానికి నేను రెడీ అంటూ విజయశాంతి డైరెక్టర్స్ కు చెప్పినట్టైయింది.
ఈ సినిమా మొత్తానికి ఆమె క్యారెక్టర్జేషన్ హైలెట్గా నిలిచింది. సాయి మంజ్రేకర్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. సోహైల్ ఖాన్ పోషించిన విలన్ పాత్రను ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేది.మరోవైపు హీరోగాకు అండగా నిలిచే రైట్ హ్యాండ్ పాత్రలో పృథ్వీ చక్కగా ఒదిగిపోయాడు. అప్పట్లో సమరసింహా రెడ్డి తర్వాత ఈ సినిమాలో పృథ్వీ తన పాత్రలో మెప్పించాడు. శ్రీకాంత్ మరోసారి తన క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.
తీర్పు
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది. తల్లి కొడుకు ఎమోషనల్ కోణం బాగుంది కానీ కథనం.. పాత తరం పద్ధతిలో సాగినా.. కమర్షియల్ పరంగా పైసా వసూల్ మూవీ
పంచ్ లైన్..‘అర్జున్ S/o వైజయంతి.. ఆకట్టుకునే తల్లి కుమారుల ఎమోషనల్ మాస్ యాక్షన్ డ్రామా..
ప్లస్ పాయింట్స్
కళ్యాణ్ రామ్, విజయశాంతి పోటా పోటీ నటన
యాక్షన్, సెంటిమెంట్ సీన్స్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
రొటిన్ కథ, స్క్రీన్ ప్లే
లాజిక్ లేని సీన్స్
రేటింగ్: 3/5
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









