)
Arjun S/O Vyjayanthi: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న 'అర్జున్ S/O వైజయంతి' మూవీని పూర్తి యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లి కొడుకులుగా పవర్ ఫుల్ పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇటివలే రిలీజ్ చేసిన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయబోతున్నారు.
ఈ సినిమా ఫస్ట్ సింగిల్ నయాల్ది సాంగ్ ని మార్చి 31న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కళ్యాణ్ రామ్ స్టన్నింగ్ క్లాస్ లుక్‌లో, ఉర్రూతలూగించే మాస్ డ్యాన్స్ చేస్తూ కనిపించిన పోస్టర్ బాగుంది. బ్యాక్ డ్రాప్ లో కార్నివాల్ వాతావరణం, డ్యాన్స్ ట్రూప్ పండుగ వైబ్ ని పెంచుతోంది. నాయల్ది మాస్ డ్యాన్స్ నంబర్ అని పోస్టర్ ఉంది. ఈ సినిమా కోసం అజనీష్ లోక్‌నాథ్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు.
A peppy, massy dance number with never seen before moves of @NANDAMURIKALYAN ❤️???
'????? ?/? ??????????' First Single #Nayaaldhi out on March 31st ???
In cinemas soon.#ArjunSonOfVyjayanthi@NANDAMURIKALYAN @vijayashanthi_m @saieemmanjrekar @SohailKhan… pic.twitter.com/gdyAkYo90t
— NTR Arts (@NTRArtsOfficial) March 28, 2025
ఈ చిత్రంలో సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, పృథ్వీవీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు. ఇక మరోవైపు కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీకి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ బింబిసార 2 ఈ సినిమాతో పాటు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అన్ని వర్క్స్ పూర్తయ్యాయి. బింబిసార కథ ముందు జరిగిన స్టోరీతో ఈ సినిమా ప్రీక్వెల్ గా రాబోతుంది.ఈ సినిమాను బింబిసారను డైరెక్ట్ చేసిన వశిష్ఠ కాకుండా అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe