Kamal Haasan speech in thug life movie event: కమల్ హసన్ హీరోగా థగ్ లైఫ్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఆడియో విడుదల కార్యక్రమంలో ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ క్రమంలో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. థగ్ లైఫ్ సినిమాలో మలయాళ నటుడు జార్జ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. నటి త్రిషతో కమల్ హసన్ రొమాన్స్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.
"When I met #KamalHaasan sir at my house with my father, i asked Kamal sir for a hug & i didn't bath for 3 days, because i want his odour on me?. After my cancer surgery, KamalHaasan sir called me, I had tears after his call?♥️"
- #Shivarajkumar pic.twitter.com/lmcVqZ17Zc— AmuthaBharathi (@CinemaWithAB) May 25, 2025
థగ్ లైఫ్.. సినిమాలో.. జోజూ జార్జ్ నటన చూసి చాలా ఇంప్రెస్ అయ్యానని చెప్పారు. ఆయన నటన చూస్తే నాకే జెలసీగా కూడా అన్పించిందన్నారు. కమల్ హాసన్ నుంచి ఊహించని ఈ ప్రశంసలు అందుకున్న జోజూ జార్జ్, వేదికపైనే ఎమోషనల్ అయ్యాడు. 'థగ్ లైఫ్' సినిమాపై అందరికి నచ్చుతుందన్న నమ్మకం ఉందని మాట్లాడారు. ఈ క్రమంలో కమల్ హసన్ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తాను పార్టీ పెట్టి, ప్రజల్లోకి వెళ్లింది.. కేవలం ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో కాదన్నారు. తమిళ ప్రజలకు తన వంతుగా మంచిసేవ కార్యక్రమాలు చేయాలని ఉద్దేష్యంతో పార్టీ పెట్టినట్లు క్లారిటీ ఇచ్చారు. ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నామని, భవిష్యత్లులో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికి కూడా తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు ఈ మూవీ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా కన్నడ నటుడు శివకుమార్ హజరయ్యాడు. ఆయన చిన్నతనంలో వాళ్ల నాన్నను కలవడానికి కమల్ హసన్ ఇంటికొచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.
Read more: Manchu Manoj: వాళ్లు నా మీద కత్తులు దూస్తుంటే.. శాంతి మంత్రం జపించాలా..?.. మంచు మనోజ్ ఎమోషనల్...
కమల్ హసన్ తన ఇంటికి వచ్చి.. తనను ప్రేమతో హగ్ చేసుకున్నాడని..ఆయన మాటలు ఇంకా తన మనస్సులో ఉన్నాయని మాట్లాడారు. తన ఫెవరెట్ హీరో.. తన ఇంటికి రావడం, హగ్ చేసుకొవడం ఎప్పటికి మర్చిపోలేనన్నాడు. కమల్ హషన్ ను హగ్ చేసుకున్న తర్వాత.. మూడు రోజులు పాటు స్నానం చేయలేదని అప్పటి విషయాల్ని శివకుమార్ చెప్పుకుని భావోద్వేగానికి గురయ్యాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









