Kamal Haasan: కన్నడ భాషకు తమిళం తల్లి అంటూ వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న కమల్‌హాసన్‌కు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. కమల్ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బ తీశారన్నారు. ఆయన కావాలనే ఈ వ్యాఖ్యలు చేసారని కోర్టు అభిప్రాయ పడింది. ఆయన క్షమాపణలు చెప్పకపోవడానికి అహం కారణమంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.మొత్తంగా తాను చేసిన వ్యాఖ్యలు అనుకోకుండా పొరపాటున చేశాను. తప్పైంది క్షమించండి అంటే సరిపోయేది. కానీ కావాలనే ఈ ఇష్యూ పెద్దది చేసి తానో తమిళ భాషను ఉద్దరించేవాడిననే కలరింగ్ ఇచ్చుకోవడమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఆది నుంచి కమల్ హాసన్ తీరు అంతే.. మన దేశంలో నటనతో కమల్ హాసన్ కు పేరు పెట్టేవారు లేరు. కానీ ఈయన నోటి దురుసు కారణంగా గత కొంత కాలంగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ఈయన మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా పలు మార్లు మాట్లాడారు. అదే ఇతర మతాల విషయంలో అలాగే మాట్లాడుతాడా అంటే అది లేదు. ఈయన సెక్యులరిజం ఓ వైపు ఉందనే టాక్ ఈయన ప్రత్యర్థులు అంటారు. ఇతర మతాల జోలికి పోవాలంటే ఈ యూనివర్సల్ హీరోకు సుస్సు పడాల్సిందే.
మొత్తంగా తన సినిమాకు ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడం ఆ మంటపై చలి కాచుకోవడం ఈయనకు ముందు నుంచే అలవాటే అని కొన్ని తమిళ పత్రికలు కూడా రాసాయి. మొత్తంగా కర్ణాటక హైకోర్టు మాత్రం కమల్ హాసన్ తీరుపై మండపడింది. ఒక సారీ చెబితే పోయేదానికి ఆయన కావాలనే పెద్ద రచ్చ చేసుకున్నట్టు తెలుస్తుంది. కర్ణాటకో హైకోర్టు ఈ ఇష్యూకు సంబంధించిన విచారణను జూన్ 10కి వాయిదా వేసింది. అప్పటి వరకు కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ సినిమా విడుదల ఉండబోదని ప్రకటించింది. మరోవైపు కమల్ హాసన్ అంతకు ముందు ఒక ప్రకటన విడుదల చేశారు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారన్నారు. అయితే క్షమాపణలు మాత్రం చెప్పలేదు. మొత్తంగా కమల్ హాసన్ తన అహంతో ‘థగ్ లైఫ్’ సినిమాకు నష్టం చేసుకున్నారనే వ్యాఖ్యలు తమిళ సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇక కమలహాసన్ , మణిరత్నం కాంబినేషన్ లో 38 యేళ్ల తర్వాత సినిమా వచ్చింది. రేపు విడుదల కాబోతున్న ‘థగ్ లైప్’ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి.
Also Read: Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా
Also Read: NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









